బంగారం ధర భారీగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర శుక్రవారం రూ.661 దిగొచ్చి.. రూ.46,847 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ క్షీణించడం, రూపాయి విలువ పెరగటం వంటి కారణాలతో.. దేశీయంగా బంగారం ధరలు దిగొచ్చినట్లు చెబుతున్నారు విశ్లేషకులు.
వెండి ధర (దిల్లీలో) కూడా కిలోకు రూ.347 తగ్గి.. రూ.67,894 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,815 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 26.96 డాలర్ల వద్ద ఫ్లాట్‌గా ఉంది.
ఇదీ చదవండి:బిట్‌కాయిన్ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది?