బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల స్వచ్చమైన పసిడి ధర రూ.411 ఎగిసి.. రూ.47,291 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్ ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
వెండి ధర కూడా కిలోకు రూ.338 పెరిగింది. దీనితో కిలో ధర రూ.68,335కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు 1,787 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు స్వల్పంగా పెరిగి.. 26.08 డాలర్ల వద్దకు చేరింది.
ఇదీ చదవండి:'ఆటో' రంగంపై కరోనా సెగ- విక్రయాలు తగ్గేనా?