బంగారం ధర బుధవారం భారీగా రూ.347 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.48,758 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి డిమాండ్‌కు తగ్గట్లు దేశీయంగానూ బంగారం ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.606 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.65,814 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,854 డాలర్లకు పెరిగింది. వెండి ధర 25.28 డాలర్లకు ఎగిసింది.
ఇదీ చూడండి:ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో నయా ఫీచర్