బంగారం ధర బుధవారం స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రేటు రూ. 311 వృద్ధి చెంది.. రూ.40, 241కు చేరింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కాస్త క్షీణించడం కారణంగానే బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధర సానుకూలంగా కదలాడటం మరో కారణంగా చెబుతున్నారు.
వెండి ధర నేడు స్వల్పంగా క్షీణించింది. కిలో వెండికి (దిల్లీలో) రూ. 468 తగ్గి రూ.35,948 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,490 డాలర్లుగా ఉండగా.. వెండి ఔన్సుకు 12.38 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: 2 నెలల్లో 13 వేల పాయింట్లు మింగేసిన కరోనా