బంగారం ధర గురువారం స్వల్పంగా తగ్గగా.. వెండి ధర కాస్త పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.93 తగ్గి.. రూ.46,283కు చేరింది.
వెండి ధర రూ.99 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.66,789 వద్ద ఉంది.
అంతర్జాతీయంగా ధరలు తగ్గుతుండటం వల్ల దేశీయంగానూ పసిడి ధరలు తగ్గినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,780 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 25.96 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇదీ చూడండి: సెప్టెంబర్ 10న మార్కెట్లోకి 'గూగుల్-జియో' స్మార్ట్ఫోన్
ఇదీ చూడండి: 'సంస్థ వృద్ధి కన్నా.. సేవా కార్యక్రమాలతోనే తృప్తి'