బంగారం ధర మంగళవారం స్వల్పంగా రూ.57 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.48,931 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పెరగడం వల్ల.. ఆ ప్రభావం దేశీయంగా పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వెండి ధర మాత్రం భారీగా కిలోకు రూ.477(దిల్లీలో) తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.49,548 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,755 డాలర్లుగా, వెండి ఔన్సుకు 17.82 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:ఫ్యాబిఫ్లూ టు కొరోనిల్... ఏ మందు ఎవరికి?