గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు మళ్లీ భారీగా పెరిగాయి. జులైలో గోల్డ్ ఈటీఎఫ్‌లకు మొత్తం రూ.921 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్‌లో నమోదైన రూ.494 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే.. ఇవి 86 శాతం అధికం.
భారత మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (ఎఎంఎఫ్ఐ) తాజా గణాంకాల్లో ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది గడిచిన 7 నెలల్లో గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు తొలిసారి మొత్తం రూ.4,452 కోట్లు దాటినట్లు తెలిపింది.
నెలవారీ ప్రాతిపదికన గోల్డ్ ఈటీఎఫ్‌లకు జనవరిలో అత్యల్పంగా రూ.202 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో అత్యధికంగా రూ.1,483 కోట్లు రావడం గమనార్హం.
మార్చిలో కరోనా భయాలతో మదుపరులు లాభాల స్వీకరణకు(రూ.195 కోట్లు) దిగారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులే సురక్షితంగా భావించి ఏప్రిల్‌లో రూ.731 కోట్లు, మేలో రూ.815 కోట్లు పెట్టుబడులు పెట్టారు.
కరోనా భయాలు, అమెరికా చైనా మధ్య నెలకొన్న అనిశ్చితులు, డాలర్ విలువ తగ్గుతుండటం వంటి పరిణామాలు బంగారంపై పెట్టుబడి సానుకూలతను పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఇటీవల పసిడి ధరలు కొత్త గరిష్ఠాలను తాకినట్లు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:ఆర్థిక స్వేచ్ఛ కోసం అడుగులు వేయండిలా!