అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, దేశీయంగా డిమాండు లేమితో పసిడి, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి.
దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు రూ.301 తగ్గి.. రూ.38,870కి చేరింది. కిలో వెండి ధర (దిల్లీలో) నేడు ఏకంగా రూ.906 తగ్గి.. రూ.46,509 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు బంగారం ధర 1,486 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 17.54 డాలర్లకు చేరింది.
ఇదీ చూడండి: తగ్గిన ప్రభుత్వ రాబడి.. 3.6 శాతంగా ద్రవ్యలోటు!