బంగారం ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడటం వల్ల దిల్లీలో పసిడి ధర రూ.182 పతనమైంది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.41,019గా ఉంది.
వెండి ధర కిలోకు రూ.1,083 మేర క్షీణించింది. దేశ రాజధానిలో కేజీ వెండి రూ.46,610గా ఉంది.
రూపాయి మారకం
డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు వృద్ధితో 71.21 వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లు
అయితే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా వృద్ధి చెందింది. ప్రస్తుతం ఔన్సు పుత్తడి 1,568 డాలర్ల వద్ద ఉండగా ఔన్సు వెండి ధర 17.47 వద్ద కొనసాగుతోంది..