బంగారం ధరలు మరోసారి స్వల్పంగా దిగొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల పసిడి రూ.121 తగ్గి రూ.38,564కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.851 తగ్గి రూ.46,384కు దిగొచ్చింది.
"బలహీన అంతర్జాతీయ సూచనలు, రూపాయి బలపడడం వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయి."
- దేవర్ష్ వకీల్, అడ్వైజరీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,497.17 డాలర్లకు, ఔన్స్ వెండి ధర 17.54 డాలర్లకు తగ్గాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1 శాతం మేర పడిపోయిన తరువాత, మధ్యాహ్నం సెషన్లో డాలర్‌తో పోల్చినపుడు రూపాయి విలువ బలపడింది. ఫలితమే బంగారం ధరల తగ్గుదల.
ఇదీ చూడండి: ట్రంప్‌కు కష్టం - దేశీయ స్టాక్‌మార్కెట్లకు నష్టం