పబ్లిక్ ఇష్యూకు సమాయత్తమవుతున్న గోఎయిర్.. తన బ్రాండు పేరును గోఫస్ట్‌గా మార్చుకుంది. కార్యకలాపాలు ప్రారంభించిన 15 ఏళ్ల తరవాత ఈ మార్పు చోటుచేసుకుంది. అత్యంత చౌక ధరల విమానయాన సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రత్యర్థి సంస్థలపై కొంత అనుకూలత సంపాదించాలనే ఉద్దేశంతో పేరు మార్చినట్లు సంస్థ తెలిపింది.
అత్యంత చౌకధరల (అల్ట్రా-లో కాస్ట్ క్యారియర్-యూఎల్‌సీసీ)కు, చౌకధరల (లోకాస్ట్ క్యారియర్‌కు-ఎల్‌సీసీ) విమానయాన సంస్థలకు తేడా ఉంటుంది. ప్రస్తుతం ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిరేషియా సంస్థలు ఎల్‌సీసీ విధానంలో విమాన సేవలు అందిస్తున్నాయి.
యూఎల్‌సీసీ విధానంలో ప్రయాణికులు బ్యాగేజీకి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సీటు, ఆహారం ఎంపికకు కూడా అదనపు రుసుం వర్తిస్తుంది. ఇలా అన్నింటినీ ఒకటే రుసుం కింద కాకుండా వేర్వేరుగా చెల్లించే వెసులుబాటు ఉండటంతో టికెట్ ఛార్జీ తక్కువగా పడుతుంది. వచ్చే మార్పిలోపు పబ్లిక్ ఇష్యూ ప్రక్రియను పూర్తి చేయాలని సంస్థ భావిస్తోంది.
ఇదీ చూడండి: అక్షయ తృతీయ: లాక్‌డౌన్‌లోనూ బంగారం కొనండిలా...