స్టాక్ మార్కెట్లకు ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయి. దేశీయంగా 2019-20 మూడో త్రైమాసిక ఫలితాల వెల్లడి దాదాపు ముగింపు దశకు చేరుకుంది. కీలక గణాంకాలు ఇప్పటికే వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ పరిణామాలు, కరోనా వైరస్ ప్రభావం వంటి వాటిపైనే మదుపరులు దృష్టి సారించే అవకాశముంది.
మహాశివరాత్రి సందర్భంగా ఎక్స్చేంజ్లకు శుక్రవారం సెలవు. ఈ పరిణామాలన్నింటి నడుమ సూచీలు 'రేంజ్ బౌండ్'లో కొనసాగే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అంతర్జాతీయంగా చూస్తే గురువారం ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మినిట్స్ ఉన్న నేపథ్యంలో దానిపై మదుపరులు దృష్టి సారించొచ్చని అంటున్నారు విశ్లేషకులు.
రూపాయి మారకం విలువ, చమురు ధరల హెచ్చుతగ్గుల వంటివీ మార్కెట్లను ప్రధానంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: 'అమెరికా కోడి కాలు పెడితే భారత పరిశ్రమ మటాష్'