ETV Bharat / business

సరిహద్దు వివాదం, ద్రవ్యోల్బణం లెక్కలే ఈ వారం కీలకం!

స్టాక్ మార్కెట్లపై ఈ వారం.. భారత్-చైనా మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదం చర్చల ప్రభావం ప్రధానంగా ఉండనుంది. వీటితోపాటు ద్రవ్యోల్బణం గణాంకాలు, అమెరికా ఫెడ్ నిర్ణయాలు మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయి.

STOCKS OUTLOOK FOR THIS WEEK
ఈ వారం స్టాక్ మార్కెట్ల అంచనాలు
author img

By

Published : Sep 13, 2020, 2:24 PM IST

సరిహద్దు వివాదంపై భారత్​-చైనా మధ్య జరుగుతున్న చర్చల ప్రభావం ఈ వారం స్టాక్ మార్కెట్లపై ప్రధానంగా ఉండనుంది. వీటితో పాటు సోమవారం విడుదల కానున్న రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయి.

ఆర్థిక వృద్ధిపై ప్రతికూల అంచనాలు, భారీగా పెరుగుతున్న కరోనా కేసులకు తోడు భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలోనూ గత వారం మార్కెట్లు లాభాలను గడించాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్​ రెండో దశ నిధుల వేటలో పడినట్లు ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. మార్కెట్లకు రానున్న రోజుల్లో ఇది సానుకూల అంశమని చెబుతున్నారు సామ్​కో సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు నిరాలి షా.

కీలక వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్​ తీసుకునే నిర్ణయాలు ఈ వారం మార్కెట్లపై ప్రభావం చూపే అంతర్జాతీయ పరిణామాల్లో ముఖ్యమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వ్యాక్సిన్​పై వచ్చే అప్​డేట్లు కూడా కీలకంగా మారనున్నాయని చెబుతున్నారు.

వీటితో పాటు రూపాయి, ముడి చమురు ధరల కదలికలు మార్కెట్లపై ప్రభావం చూపే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ దెబ్బకు 2.1 కోట్ల వేతన ఉద్యోగాల్లో కోత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.