భారత్ నుంచి తాను పారిపోలేదని పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీతెలిపారు. తాను చట్టానికి కట్టుబడే వ్యక్తినన్నారు. ఈ మేరకు డొమినికా హైకోర్టులో 8 పేజీల ప్రమాణపత్రం దాఖలు చేశారు.
తనను వివారించుకోవచ్చని భారత్ అధికారులకు గతంలోనే తెలిపినట్లు చోక్సీ పేర్కొన్నారు. ఆమెరికాలో వైద్యం చేయించుకోవడానికి భారత్ విడిచి వెళ్ళినప్పుడు తనపై ఎలాంటి వారెంట్ లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చోక్సీని భారత్‌కు అప్పగించాలన్న పిటిషన్‌పై.. ప్రస్తుతం డొమినికా హైకోర్టులో విచారణ జరుగుతోంది.
మరోవైపు ఆంటిగ్వా నుంచి మెహుల్ను కిడ్నాప్ చేశారన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆంటిగ్వా పోలీసులు తెలిపారు. మెహుల్ను కిడ్నాప్ చేసిన వ్యక్తుల వివరాలను.. అతని తరఫు న్యాయవాది తమకు సమర్పించారని ఆంటిగ్వా ప్రధాని గ్యాస్టన్ బ్రౌన్ తెలిపారు.
ఇదీ చదవండి : 'నా భర్తను క్షేమంగా ఆంటిగ్వా చేర్చండి'