ETV Bharat / business

అక్టోబర్ అలర్ట్.. నేటి నుంచి వచ్చిన మార్పులు ఇవే...

ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి భారీ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఆటో డెబిట్​, నిరుపయోగం అయ్యే పలు బ్యాంక్​ల చెక్​బుక్​లు, పోస్టాఫీస్ ఛార్జీలు సహా పలు ఇతర అంశాలు ఇందులో ఉన్నాయి. వాటన్నింటి పూర్తి వివరాలు మీ కోసం.

author img

By

Published : Sep 30, 2021, 5:46 PM IST

Updated : Oct 1, 2021, 8:18 AM IST

్

అక్టోబర్​ నుంచి ఆర్థికపరమైన విషయాల్లో కీలక మార్పులు జరిగాయి. ముఖ్యంగా ఆటోపే రూల్స్ మారాయి. పెన్షనర్లు లైఫ్​ సర్టిఫికేట్​ను జీవన్​ ప్రమాణ్​ కేంద్రాల్లో దాఖలు చేయాల్సి ఉంటుంది. పలు బ్యాంక్​ల చెక్​బుక్​లు నిరుపయోగం కానున్నాయి. పోస్టాఫీస్​ ఏటీఎం ఛార్జీల భారం పడనుంది. వీటన్నింటితో పాటు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చిన మార్పులు, ఛార్జీలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆటో డెబిట్ అంత ఈజీ కాదు..

ఇకపై ఆటో డెబిట్​ సదుపాయం వినియోగించుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే.. ఆటో డెబిట్​​ రూల్స్​లో భారీ మార్పులు వచ్చాయి. క్రెడిట్​, డెబిట్​ కార్డుల ద్వారా ఇకపై ఆటో డెబిట్​ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్​కు అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్‌ఏ) అవసరం. అక్టోబర్​ 1 నుంచే ఈ కొత్త రూల్స్​ అమలులోకి వస్తాయని ఆర్​బీఐ గతంలోనే స్పష్టం చేసింది.

లైఫ్​ సర్టిఫికేట్​ దాఖలు జీవన్​ ప్రమాణ్​ కేంద్రాల్లోనూ..

80 అంతకన్నా ఎక్కువ వయసున్న పెన్షనర్లకు గుడ్​ న్యూస్​. వారంతా తమకు దగ్గర్లో ఉన్న జీవన్​ ప్రమాణ్​ కేంద్రాల్లో డిజిటల్​ లైఫ్​ సర్టిఫికేట్​ను సమర్పించేందుకు వీలుంది. దేశవ్యాప్తంగా ఉన్న హెడ్​ పోస్టాఫీసుల్లో ఈ కేంద్రాలు ఉంటాయి. అక్టోబర్​ 1 నుంచి- నవంబర్​ 30 వరకు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.

లైఫ్​ సర్టిఫికేట్​ ఎందుకు?

పెన్షన్​దారులు జీవించి ఉన్నారని తెలిపేందుకు ఉద్దేశించినదే ఈ లైఫ్​ సర్టిఫికెట్​. ఇది బయోమెట్రిక్​తో కూడిన ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. ఆధార్, బయోమెట్రిక్​ను ఉపయోగించి దీనిని పొందవచ్చు.

కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ఉద్యోగ విరమణ అయిన అనంతరం పెన్షన్​ పొందేందుకు ఖాతా ఉన్న బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ జీవన ప్రమాణ పత్రాన్ని తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది

ఆ బ్యాంక్​ల చెక్ బుక్​లు పని చేయవు..

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సంస్థ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ తమ కస్టమర్లకు కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఓబీసీ), యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ) చెక్‌బుక్‌లు పనిచేయవని స్పష్టం చేసింది. ఈ బ్యాంకుల ఖాతాదారులు కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవాలని సూచించింది.

గతేడాది ఏప్రిల్‌లో ఓబీసీ, యూబీఐ బ్యాంకులను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. విలీనమైనప్పటికీ ఇప్పటివరకు పాత చెక్‌బుక్‌లనే కొనసాగించారు. అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆ చెక్‌ బుక్‌లు పనిచేయబోవని పీఎన్‌బీ తాజాగా వెల్లడించింది. ఈ బ్యాంకుల ఖాతాదారులు వీలైనంత త్వరగా పీఎన్‌బీ ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్‌లతో ఉన్న కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవాలని తెలిపింది.

ఏటీఎం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, పీఎన్‌బీ వన్‌ నుంచి వీటిని దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. లేదంటే కస్టమర్లు నేరుగా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి కూడా కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవచ్చని తెలిపింది.

10 శాతం పెట్టుబడి పెట్టాల్సిందే..!

అసెట్​ మేనేజ్​మెంట్ కంపెనీల్లో పని చేసే జూనియర్​ స్థాయి ఉద్యోగులకు అక్టోబర్​ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. జూనియర్​ స్థాయి ఉద్యోగులంతా ఇకపై తమ స్థూల వేతనంలో 10 శాతం మొత్తాన్ని తాము నిర్వహిస్తున్న ఫండ్​లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్​ ఆఫ్ ఇండియా (సెబీ) ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. 2023 అక్టోబర్ నాటికి ఈ పరిమితిని 20 శాతానికి పెంచనుంది సెబీ.

ఇప్పటికే తాము నిర్వహిస్తున్న ఫండ్లలో పెట్టుబడులు ఉంటే.. అలాంటి ఉద్యోగులు కొన్ని షరతులకు లోబడి.. వేతనాలపై పడే ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

పోస్టాఫీస్​ ఖాతాదారులకు ఛార్జీల మోత..

పోస్టాఫీస్​లో సేవింగ్స్​ ఖాతా ఉన్న వారికి.. వచ్చే నెల ఛార్జీల భారం పడనుంది. పోస్టాఫీస్​ ఏటీఎంలలో జరిపే ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఇండియా పోస్ట్​ తెలిపింది.

2021 అక్టోబర్​ 1 నుంచి 2022 సెప్టెంబర్​ 30 కాలానికి సంబంధించి యూన్యువల్​ మెయింటెనెన్స్​ ఏటీఎం/డెబిట్​ కార్డ్​ లావాదేవీలకు రూ.125+ జీఎస్​టీ ఛార్జ్​ చేయనుంది ఇండియా పోస్ట్​. దీనితో పాటు ఎస్​ఎంఎస్​ అలర్ట్​ ఛార్జీల కింద రూ.12+ జీఎస్​టీ వసూలు చేయనున్నట్లు​ పేర్కొంది.

వాహనాల ధరలు పెంపు..

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టొయోటా కిర్లోస్కర్​ మోటార్స్​ (టీకేఎం)​.. వాహనాల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. అన్ని సెగ్మెంట్లలోని వాహనాలపై 2 శాతం వరకు ధరల పెంపు ఉంటుందని మంగళవారం తెలిపింది. వెల్ఫైర్​ మోడల్​కు మాత్రం ఇందుకు మినహాయింపునిచ్చింది. పెరిగిన ధరలు అక్టోబర్ 1 నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది టీకేఎం.

ముడి సరకు ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగటం వల్ల.. వాహనాల ధరల పెంపు తప్పనిసరైందని టొయోటా పేర్కొంది. గత ఏడాది కాలంగా ఉక్కు, ఇతర విలువైన లోహాల ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్​ మరోసారి ధరల పెంపు (Tata Motors Price hike) నిర్ణయం తీసుకుంది. వాణిజ్య వాహనాల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. కొత్త ధరలు అక్టోబర్ 1 నుంచే (Tata Motors new Prices) అమలులోకి రానున్నట్లు వెల్లడించింది.

ముడి సరకు ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగటం వల్ల.. వాహనాల ధరల పెంపు తప్పడం లేదని టాటా మోటర్స్​ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉత్పత్తి వ్యయాలు కాస్త తగ్గించుకున్నట్లు కూడా వివరించింది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 1, 2021, 8:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.