ఏప్రిల్ 1 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు, నూతన నిబంధనలు కూడా అదే రోజు నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా పలు వస్తు, సేవల ధరల్లో హెచ్చు తగ్గులు కనిపించనున్నాయి.
ధరలు పెరిగేవి..
బడ్జెట్ 2021-22 ప్రకారం.. ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఫ్రిజ్‌లు, ఏసీలు, టీవీల ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే దేశీయంగా దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు పెంచనున్నట్లు అధికారిక సంకేతాలు కూడా ఇచ్చాయి.
ఇదీ చదవండి:సమ్మర్ షాక్: పెరగనున్న ఏసీల ధరలు!
ఎల్‌ఈడీ బల్బులు, సర్క్యూట్ బోర్డులు, వాటి విడి భాగాలు, సోలార్ ఇన్వెర్టర్స్, సోలార్ దీపాల ధరలకు రెక్కలు రానున్నాయి.
మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు, లిథియంతో తయారు చేసిన ఫోన్ బ్యాటరీ ధరలు మరింత పెరిగే అవకాశముంది.
ఆటో మొబైల్ విడి విభాగాల ధరలు పెరగవచ్చు. దీని వల్ల వాహనాల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే మారుతీ, టొయోటా సహా పలు ఆటోమొబైల్ సంస్థలు ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలు పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.
ఇదీ చదవండి:ఏప్రిల్‌లో పెరగనున్న మారుతీ కార్ల ధరలు
ఇంక్ క్యాట్రిడ్జ్‌లు, ఇంక్ స్ప్రే నాజిల్స్, లెథర్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ముడి సిల్క్, నూలు వస్త్రాల ధరలు పెరుగుతాయి. ప్లాస్టిక్ వస్తువులు, సింథటిక్ వస్తుల ధరలు కూడా పెరిగే అవకాశముంది. వంటనూనె ధరలు పెరుగుతాయి. ఇప్పటికే వంట నూనె ధరలు రికార్డు స్థాయిల వద్ద ఉన్నాయి.
ధరలు తగ్గేవి..
దిగుమతి సుంకాలు తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. ప్లాటినం, పల్లాడియం ధరలు తగ్గే అవకాశముంది.
వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో కాస్త తగ్గుదల కనిపిస్తుంది. అంతర్జాతీయ సంస్థల నుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలు, యంత్రాల ధరలు తగ్గనున్నాయి.
ఇవీ చదవండి: