FRL-Reliance merger: రిలయన్స్‌తో ఫ్యూచర్ రిటైల్ చేసుకున్న రూ.24,500 కోట్ల ఒప్పందంపై అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై స్పందించాలని ఫ్యూచర్ గ్రూప్‌కు నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదంటూ 'అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం' ఇచ్చిన తీర్పుపై దిల్లీ హైకోర్టు స్టే ఇవ్వడాని వ్యతిరేకిస్తూ.. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
అమెజాన్ వేసిన పిటిషన్‌పై ఫ్యూచర్ గ్రూప్ నుంచి వివరణ కోరుతూ.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
రిలయన్స్‌తో ఫ్యూచర్ గ్రూప్ చేసుకున్న రూ. 24,500 కోట్ల ఒప్పందంపై ముందుకు వెళ్లకూడదని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఫ్యూచర్ గ్రూప్ స్టే ఇవ్వాలని దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సానుకూలంగా స్పందించి.. అమెజాన్‌కు వ్యతిరేకంగా న్యాయస్థానం స్టే విధించింది. దీనిపై అమెజాన్ తిరిగి సుప్రీంకోర్టు తలుపుతట్టింది.
ఇవీ చూడండి: