ETV Bharat / business

90 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ! - 90 నిముషాల్లో ఫ్లిప్​కార్డ్​ డెలివరీ

ప్రస్తుతం ఆన్​లైన్​లో వస్తువులను ఎక్కువ సంఖ్యలో కోనుగోలు చేస్తున్నారు వినియోగదారులు. ఒక్కసారి వస్తువు ఆర్డర్​ ఇచ్చిన తర్వాత మనకు అందటానికి దాదాపు 2 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ సమయమే పడుతోంది. ఈ తరుణంలో నిత్యావసరాలను 90 నిమిషాల వ్యవధిలోనే అందించటానికి ప్రముఖ ఆన్​లైన్​ వాణిజ్య సంస్థ ఫ్లిప్​కార్ట్​ సన్నాహాలు చేస్తోంది. 'ఫ్లిప్​కార్ట్ క్విక్'​ పేరిట ఈ సేవలను అందించనుంది సంస్థ.

Flipkart Quick delivery in 90 minutes
90 నిముషాల్లోనే వస్తువుల డెలివరీ!
author img

By

Published : Jul 28, 2020, 3:30 PM IST

దైనందిన జీవితంలో ప్రజలకు అవసరమయ్యే నిత్యావసరాలను కేవలం 90 నిమిషాల వ్యవధిలోనే అందించగల సదుపాయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆన్‌లైన్‌ వాణిజ్య సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. 'ఫ్లిప్‌కార్ట్‌ క్విక్‌' పేరుతో లభించే ఈ స్థానిక సేవల్లో భాగంగా.. సరకులు, గృహావసర వస్తువులతో పాటు మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను కూడా అతి త్వరగా అందిస్తామని సంస్థ వివరించింది. తొలుత తమ సేవలు బెంగుళూరులో ప్రారంభమౌతాయని.. అనంతరం దేశంలోని మరిన్ని నగరాల్లో విస్తరిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులో వచ్చేదీ వెల్లడించలేదు.

కొవిడ్‌-19 మహమ్మారి కాలంలో భారత్‌లో భౌతికదూరం తదితర నిబంధనలను పాటించటం అనివార్యమైంది. దీనితో వినియోగదారులు వస్తుసేవలను ఆన్‌లైన్‌ ద్వారా పొందేందుకు గతంలో కంటే అధికంగా మొగ్గు చూపుతున్నారు. సకాలంలో నిత్యావసరాలను అందించే సేవలకు దేశంలో గిరాకీ పెరుగుతోంది. ఈ పరిస్థితిని వ్యాపారాభివృద్ధికి దోహదం చేసే అవకాశంగా మలుచుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌ సిద్ధమౌతోంది.

"ప్రస్తుత సంవత్సరంలో సగానికి పైగా కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తించి ఉన్న నేపథ్యంలో.. భారత్‌లో వస్తుసేవలను అందించే విధానంలో పెనుమార్పులు వచ్చాయి. ఆన్‌లైన్‌లో ఈ సేవలను పొందటం దేశంలో దీర్ఘకాలిక అవసరంగా పరిణమించింది." అని సంస్థ వివరించింది. తాజా ప్రకటనతో ఈ రంగంలో వ్యాపార దిగ్గజం అమెజాన్‌తో సహా బిగ్‌బాస్కెట్‌, రిలయన్స్‌ జియో మార్ట్‌లతో ఫ్లిప్‌కార్ట్‌ ఆధిపత్య పోరు మరింత తీవ్రతరం కానున్నట్టు మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని ఇ-వాణిజ్య రంగంలో అధిక వాటా కలిగిన ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా వ్యాపార దిగ్గజం వాల్‌మార్ట్ 2018లో స్వంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి:ఆటో, ఐటీ జోరు.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.