ETV Bharat / business

ఇకపై వరంగల్​, తిరుపతిల్లోనూ ఫ్లిప్​కార్ట్​ కిరాణ సేవలు

దేశంలో ద్వితియ శ్రేణి నగరాల్లోనూ కిరాణ వస్తు సేవలను అందించనుంది ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్. ​దిగువ శ్రేణి నగరాల్లోనూ ఆన్​లైన్​ కొనుగోళ్లకు డిమాండ్​ బాగా పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సీనియర్​ ఉపాధ్యాక్షుడు మనీష్​ కుమార్ తెలిపారు.​

Flipkart Grocery now available in over 50 cities
ఇకపై వరంగల్​, తిరుపతిల్లోనూ ఫ్లిప్​కార్ట్​ కిరాణ సేవలు
author img

By

Published : Mar 2, 2021, 2:54 PM IST

తిరుపతి, వరంగల్​ వంటి టైర్​-2 నగరాల్లోనూ ఇకపై ఫ్లిప్​కార్ట్ కిరాణ వస్తు​ సేవలు అందనున్నాయి. దేశంలో సుమారు 50 నగరాలకు నిత్యావసర సేవలు విస్తరించాలని ఫ్లిప్​కార్ట్​ నిర్ణయం తీసుకుంది. పలు రంగాల్లో సేవలు అందిస్తున్న ఈ దిగ్గజ సంస్థ కిరాణ సేవల విభాగంలోనూ మంచి లాభాలను ఆర్జించాలని యోచిస్తోంది. దేశంలో ఏడు ప్రథమ శ్రేణి నగరాలతో సహా 40 దిగువ శ్రేణి నగరాలలోని వినియోగదారులకు ఫ్లిప్​కార్టు కిరాణ సేవలు అందనున్నాయి.

కరోనా ప్రభావంతో కిరాణ సామగ్రికి వినియోగదారులు ఈ-కామర్స్​ సేవలనే వినియోగించుకుంటున్నారు. కేవలం మెట్రో నగరాల్లోనే కాకుండా ద్వితియ శ్రేణి నగరాల్లోనూ ఈ విధానం పెరిగిపోయింది. 2020లో రూ.330 కోట్లుగా ఉన్న ఈ-కామర్స్ విలువ 2025 నాటికి రూ. 2400 కోట్లకు చేరుతుందని కన్సల్టేన్సీ సంస్థ రెడ్​సీర్​ అంచనా.

తాజా వ్యాపార విస్తరణతో కోల్​కతా, పుణె, అహ్మదాబాద్ వంటి నగరాలలో స్థిరమైన కిరాణ విక్రయ కేంద్రాల ఏర్పాటుతోపాటు ఇప్పుడు నాన్​మెట్రో నగరాలైన తిరుపతి, వరంగల్, మైసూర్​, కాన్పూర్, అలహాబాద్​, అలీగఢ్​​, జైపుర్​, చండీగఢ్​, రాజ్​కోట్​, వడోదర, వెల్లూర్​, డయ్యూడామన్​ లకు కిరాణ సేవలను విస్తరించనుంది.

" కిరాణ సేవలు ప్రస్తుతం వేగంగా వృద్ధి చేందుతున్న విభాగం. నాణ్యమైన గృహ అవసరాలు, శుభ్రమైన ఆహారోత్పత్తులకు వినియోగదారుల నుంచి మంచి డిమాండ్​ ఉంది. అందుకే ఈ రంగంలో పెట్టుబడి పెడుతున్నాం. అంతేకాకుండా దిగువ శ్రేణి నగరాలలోనూ దుకాణాలకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండి కొనుగోలు చేయడానికి డిమాండ్​ బాగా పెరిగింది."

- మనీష్​ కుమార్​, ఫ్లిప్​కార్ట్​ ఉపాధ్యాక్షుడు,

ఫ్లిప్​కార్ట్​ కిరాణ సేవలలో 200 రకాలలో 7000 పైగా వస్తువులు ఉన్నాయి. తమ నిత్యావసరాల సేవల విస్తరణ స్థానిక ఆహార పరిశ్రమకు మంచి పరిణామమని ఫ్లిప్​కార్డ్​ అభిప్రాయపడింది. రైతులను లక్షలాది వినియోగదాలను అనుసంధానం చేస్తుందని ధీమా వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి : గట్టెక్కే దాకా పరిశ్రమలకు గట్టి చేయూత అవసరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.