ప్రీమియం స్మార్ట్ఫోన్లపై అదిరే ఆఫర్లతో సరికొత్త సేల్ ప్రారంభించింది ఫ్లిప్‌కార్ట్. 'ఫ్లాగ్షిప్ ఫెస్ట్ సేల్' పేరుతో ఏప్రిల్ 13న ప్రారంభమైన ఈ సేల్.. గురువారంతో (ఏప్రిల్ 15) ముగియనుంది.
శాంసంగ్, యాపిల్, షియోమీ, మోటోరొలా, ఎల్జీ సహా ఇతర బ్రాండ్ల మొబైళ్లను భారీ తగ్గింపు ధరకు విక్రయిస్తోంది.
50 శాతానికపైగా డిస్కౌంట్..
ఎల్జీ వింగ్ స్మార్ట్‌ఫోన్‌పై అత్యధిక డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఈ ఫోన్ అసలు ధర రూ.69,990గా ఉండగా.. ఈ సేల్‌లో ఆ ధరను ఏకంగా రూ.29,999కి (50 శాతానికిపైనే) తగ్గించింది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 5జీ సపోర్ట్, రెండు స్క్రీన్ల వంటి అధునాత ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
ఐఫోన్లపై ఆఫర్లు ఇలా..
ఐఫోన్ 11, ఐఫోన్ ఎక్స్ఆర్ వంటి మోడళ్లపై భారీ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఈ రెండు ఫోన్ల ఆఫర్ ధరలు వరుసగా.. రూ.46,999, రూ.39,999గా ఉన్నాయి. ఐఫోన్ ఎస్ఈ ధరను రూ.39,900 నుంచి రూ.29,999కి తగ్గించింది. హెచ్డీఎఫ్సీ కార్డ్ ద్వారా ఐఫోన్ 12 కొనుగోలు చేసే వారికి రూ.6,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
ఇతర ఫోన్లపై డిస్కాంట్లు ఇవి..
షియోమీ ఎంఐ 10టీ ప్రారంభ ధరను రూ.32,999(రూ.35,999 నుంచి)గా ఉంచింది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 62 ధరను భారీగా రూ.23,999 నుంచి రూ.21,999కి తగ్గించింది.
మోటొరోలా ఫోల్డబుల్ ఫోన్ 'రేజర్ 5జీ' ఆఫర్ ధరను రూ.99,999గా నిర్ణయించింది ఫ్లిప్‌కార్ట్