పండుగ సీజన్ నేపథ్యంలో దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చిన 'బిగ్ బిలియన్ డేస్' ప్రత్యేక సేల్ ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ స్పెషల్ సేల్.. అక్టోబర్ 10తో ముగియనుంది. మరి ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లు ఎలా ఉన్నాయి? అనేది తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు ఇలా..
ఈ ప్రత్యేక సేల్‌లో ఐఫోన్ 12 ధరను (iPhone offers on Flipkart) రూ.49,999కు తగ్గించింది ఫ్లిప్‌కార్ట్. ఐఫోన్ 12 మినీ ధరను రూ.38,999గా ఉంచింది. ఇక బడ్జెట్ ఐఫోన్ ఎస్ఈ (2020)ని రూ.26,999కే విక్రయిస్తోంది.
గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.31,999 నుంచి రూ.25,999కి తగ్గించింది ఫ్లిప్‌కార్ట్. దీనితో పాటు గూగుల్ బడ్స్‌పై 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
ఫోన్లతోపాటు టీవీలు, ఫ్రిడ్జ్‌లు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై భారీ తగ్గింపు ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్.
సేల్ డిస్కౌంట్లతో పాటు.. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల ద్వారా చెల్లింపులు జరిపితే అదనంగా మరో 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపితే రూ.200 వరకు డిస్కౌంట్ లభించనుందని వెల్లడించింది.
అయితే ఈ ఆఫర్లన్ని ఆదివారం అర్ధరాత్రి వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఆ తర్వాత కూడా పలు ఎంపిక చేసిన ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఉండనున్నాయి.
అమెజాన్ ఆఫర్లు ఇలా..
మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా.. అక్టోబర్ 2 నుంచే 'గ్రేట్ ఇండియా ఫెస్టివల్'సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, సిటీ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌ల క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితే 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. రూపీ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ (6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్) ధరను రూ.25,999కి తగ్గించింది అమెజాన్. దీని అసలు ధర రూ.29,999గా ఉంది. కూపన్ ద్వారా మరో రూ.1000 డిస్కౌంట్ పొందే వీలుంది.
ఐఫోన్ 11 (64 జీబీ) ధరను రూ.38,999గా నిర్ణయించింది అమెజాన్.
రెడ్మీ 50 4కే టీవీ ధరను రూ.44,999 నుంచి రూ.35,999కి తగ్గించింది. ఎక్స్ఛేంజ్ ద్వారా మరింత డిస్కౌంట్ పొందే వీలుంది.
ఈ సేల్ నడుస్తుండగానే.. ప్రైమ్ ఫ్రైడే పేరుతో.. మరో ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ప్రతి శుక్రవారం ప్రత్యేక ఆఫర్లు ఇవ్వనుంది. ఫ్రైడే సేల్ దీపావళి వరకు కొనసాగొచ్చని అంచనాలున్నాయి. అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్ ముంగింపు ఎప్పుడనేది అమెజాన్ ఇంకా ప్రకటించలేదు.
అయితే ఇంతకు ముందు సేల్‌లను పరిశీలిస్తే.. యూజర్ల డిమాండ్ మేరకు స్పెషల్ సేల్ తేదీలను రెండు ఈ-కామర్స్ సంస్థలు మరికొన్ని రోజులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపావళి ముందు కూడా మరోసారి ఈ సేల్ అందుబాటులోకి తీసుకురావచ్చని అవకాశాలున్నాయని అంచనాలున్నాయి.
ఇదీ చదవండి: