ETV Bharat / business

30ఏళ్ల కనిష్ఠానికి దేశ ఆర్థిక వృద్ధి- 2020-21లో 2%! - భారత ఆర్థిక వ్యవస్థ పతనం

కరోనా కారణంగా నెలకొన్న అనిశ్చితితో భారత ఆర్థిక వృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైరస్​ ప్రభావంతో వృద్ధి రేటు అంచనాలను వరుసగా తగ్గిస్తూ వస్తున్నాయి ప్రముఖ రేటింగ్​ ఏజెన్సీలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 2 శాతానికే పరిమితమవుతుందని తాజాగా పేర్కొంది ఫిచ్​ రేటింగ్స్​ సంస్థ.

Fitch sees India GDP growth in FY21 at 2%
భారత వృద్ధిపై మహమ్మారి 'భారీ' దెబ్బ.. మరీ 2 శాతమా!
author img

By

Published : Apr 3, 2020, 7:37 PM IST

ఏప్రిల్​ 1న ప్రారంభమైన ప్రస్తుత (2020-21) ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి అంచనాలను 2 శాతానికి తగ్గించింది ఫిచ్​ రేటింగ్స్​ సంస్థ. ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసిన దగ్గర నుంచి 30 ఏళ్లలో ఇదే అత్యల్పం అని పేర్కొంది.

కరోనా కారణంగా.. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్​ సంస్థలు వరుసగా వృద్ధి రేటు అంచనాలను కుదిస్తూ వస్తున్నాయి. తాజాగా ఫిచ్​ కూడా అదే నొక్కిచొప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందని అభిప్రాయపడింది.

వైరస్​ తాకిడికి వినియోగదారుల వ్యయాలు తగ్గిన నేపథ్యంలో.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా నష్టపోయే జాబితాలో ఉన్నాయని అభిప్రాయపడింది ఫిచ్​ రేటింగ్స్​.

మిగతావి ఏమంటున్నాయ్​...?

ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 4 శాతానికి పరిమితమవుతుందని ఇవాళ పేర్కొంది. ప్రపంచవ్యాప్త రాబడిలో దాదాపు 5 శాతం(4.1 ట్రిలియన్​ డాలర్లు) తగ్గనుందని విశ్లేషించింది.

ఎస్​ అండ్​ పీ గ్లోబల్​ రేటింగ్స్​.. వృద్ధి రేటును 3.5 శాతానికి కుదించింది. అంతకుముందు.. 5.2 శాతంగా నమోదవుతుందని అంచనా వేయడం గమనార్హం.

దేశీయ క్రెడిట్​ రేటింగ్​ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్​ కూడా తమ అంచనాల్ని ఇటీవల సవరించింది. ఆర్థిక వృద్ధిని 5.5 నుంచి 3.6 శాతానికి పరిమితం చేసింది.

మూడీస్​ భారీగా.....

మూడీస్​ ఇన్వెస్టర్స్​ సర్వీస్​ కూడా మిగతా వాటి బాటలోనే పయనించింది. మూడీస్​ ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 2.5 శాతమే. అంతకముందు 5.3 శాతంగా అంచనా వేసింది. కొవిడ్​-19 మహమ్మారి ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ కొట్టిందని అభిప్రాయపడింది.

మార్చి 31తో ముగిసిన క్రితం ( 2019-20) ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన 5 శాతం వృద్ధి రేటుతో పోల్చి... తాజా వృద్ధి అంచనాలను వెలువరించాయి రేటింగ్​ సంస్థలు.

దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్​డౌన్​ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రైవేట్‌ వినియోగంతో పాటు పెట్టుబడులూ తగ్గిపోయాయి. తాజా పరిణామాలన్నింటి నడుమ భారత వృద్ధి రేటును సవరించినట్లు ఆయా సంస్థలు పేర్కొన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.