ETV Bharat / business

11 సూత్రాల ప్రణాళికతో 'అన్నదాత సుఖీభవ'

author img

By

Published : May 15, 2020, 5:04 PM IST

Updated : May 15, 2020, 5:21 PM IST

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్​ మూడో విడత ప్యాకేజీలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

stimulus to agriculture and allied sectors
కరోనా ప్యాకేజీ 3.0: వ్యవసాయ రంగానికి చేయూత

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్​ మూడో విడత ప్యాకేజీలో వ్యవసాయం, అనుబంధ రంగాలైన మత్స్య, పశువర్ధక, డెయిరీ పరిశ్రమలకు పెద్దపీట వేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 11 అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు ఆమె తెలిపారు. వీటిలో 8 మౌలిక సదుపాయాలు, నిల్వ సామర్థ్యం పెంపునకు... 3 పరిపాలనా పరమైన సంస్కరణలకు సంబంధించినవి అని ఆమె స్పష్టం చేశారు.

రైతులకు భరోసా...

వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పంట ఉత్పత్తుల నిల్వ, కోతలు, ఆధునీకరణ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఈ నిధులు వెచ్చించనున్నట్లు స్పష్టం చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి రైతులకు రూ.18,700 కోట్లు బదిలీ చేసినట్లు ఆమె తెలిపారు.

గడచిన రెండు నెలల్లో ఫసల్​ బీమా యోజన కింద రైతులకు రూ.6,4000 కోట్ల పరిహారం అందజేసినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రూ.74,300 కోట్ల మేర కనీస మద్దతు ధర ఇచ్చి ఆహార ధాన్యాల కొనుగోలు చేసినట్లు తెలిపారు.

డెయిరీ రంగానికి

లాక్​డౌన్ వేళ సంక్షోభం ఎదుర్కొన్న పాల సేకరణ రంగానికి చేయూతనందించినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మిగులు పాలను సహకార డెయిరీల ద్వారా సేకరించామని... ఫలితంగా రూ.4,100 కోట్ల మేర రైతులకు ప్రయోజనం చేకూరిందని ఆమె తెలిపారు. అలాగే 2 కోట్ల మంది పాడిరైతులకు రూ.5 వేల కోట్ల మేర ప్రోత్సాహకాలు అందించామన్నారు. సహకార రంగాల్లోని డెయిరీలకు 2 శాతం వడ్డీ రాయితీ కల్పించినట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు.

గడువు తీరిన 242 ఆక్వా హేచరీస్​లకు రిజిస్ట్రేషన్ గడువు 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

Last Updated : May 15, 2020, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.