ETV Bharat / business

ఫెడ్ కీలక నిర్ణయం.. 2022 వరకు వడ్డీ రేట్లు యథాతథం!

అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యం నుంచి గట్టెక్కించేందుకు ఫెడ్​ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. 2022 వరకు స్వల్పకాలిక వడ్డీ రేట్లలో మార్పులు ఉండవని వెల్లడించింది. అలాగే బాండ్ల కొనుగోళ్లు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. కరోనా ధాటికి మందగించిన ఆర్థిక కార్యకలాపాలను పునరుత్తేజం చేయడమే ధ్యేయంగా ఫెడ్ ఈ కీలక నిర్ణయాలు తీసుకుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Fed to keep providing aid and sees no rate hike through 2022
ఫెడ్ కీలక నిర్ణయం.. 2022 వరకు వడ్డీ రేటు యధాతథం!
author img

By

Published : Jun 11, 2020, 12:58 PM IST

మాంద్యం, నిరుద్యోగ సమస్య నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022 వరకు కీలక వడ్డీరేట్ల పెంపు ఉండదని స్పష్టం చేసింది. తక్కువ రుణ రేట్లు కొనసాగించేందుకు బాండ్లు కొనుగోలు చేస్తూనే ఉంటామని పేర్కొంది.

ఫెడ్​ తన బెంచ్​మార్క్ స్వల్పకాలిక వడ్డీ రేటును సున్నాకు పరిమితం చేసింది. రెండేళ్ల పాటు ఇలా వడ్డీ రేట్లను తక్కువగా ఉంచడం వల్ల... వ్యాపారులకు, వినియోగదారులకు తక్కువ రేటుకే రుణాలు లభించనున్నాయి. ఫలితంగా వ్యాపారాలు తిరిగి ప్రారంభమై ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

"కరోనా సంక్షోభం కారణంగా ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగింది. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. కనుక ఈ ఏడాది అమెరికా వృద్ధిరేటు 6.5 శాతం మేర క్షీణించవచ్చు. అలాగే ప్రస్తుతానికి 13.0 శాతం ఉన్న నిరుద్యోగ రేటు ఈ సంవత్సరం చివరినాటికి 9.3 శాతానికి తగ్గొచ్చని అంచనా వేస్తున్నాం."

- ఫెడ్ రిజర్వ్​

బాండ్ల కొనుగోలు కొనసాగుతుంది

అమెరికా కేంద్ర బ్యాంకు (ఫెడ్ రిజర్వ్​) మార్చిలో 375 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. అయితే క్రమంగా వీటి కొనుగోళ్లను తగ్గిస్తూ వస్తోంది. ఇకపై నెలకు 80 బిలియన్ డాలర్ల విలువైన ట్రెజరీ సెక్యూరిటీలను, 40 బిలియన్ డాలర్ల విలువైన తనఖా ఆధారిత సెక్యూరిటీలను కొనుగోలు చేస్తామని ఫెడ్ స్పష్టం చేసింది. రానున్న నెలల్లో కొనుగోలు చేయనున్న బాండ్ల పరిమాణం గురించి ఫెడ్ పేర్కొనడం ఇదే మొదటిసారి.

ఇదీ చూడండి: 'ఎన్ని సమస్యలొచ్చినా.. ధైర్యంగా ముందుకు సాగాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.