ETV Bharat / business

రాష్ట్రాలకు చేరిన 2.8 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు - రాష్ట్రాలకు 2.8 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు సరఫరా చేసిన ఎఫ్​సీఐ

లాక్​డౌన్​ కొనసాగుతున్న వేళ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా... ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా భారీ స్థాయిలో ఆహార ధాన్యాలను రాష్ట్రాలకు రవాణా చేస్తోంది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2.8 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను వివిధ రాష్ట్రాలకు రవాణా చేసింది.

FCI transports 2.8 lakh tonnes food grains to states on Wednesday
రాష్ట్రాలకు చేరిన 2.8 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు
author img

By

Published : Apr 24, 2020, 7:42 AM IST

ఫుడ్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్​సీఐ) బుధవారం రికార్డు స్థాయిలో 2.8 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను వివిధ రాష్ట్రాలకు రవాణా చేసింది. ఆయా రాష్ట్రాలు రేషన్ షాపుల ద్వారా ఈ ఆహార ధాన్యాలను ప్రజలకు సరఫరా చేయనున్నాయి. లాక్​డౌన్​ వేళ ప్రజల ఆహార అవసరాలను తీర్చేందుకు ఇది ఇతోధికంగా దోహదం చేస్తుంది.

"ఎఫ్​సీఐ ఏప్రిల్​ 22న... 102 రైళ్లలో 2.8 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఆయా రాష్ట్రాలకు రవాణా చేసి సరికొత్త రికార్డు సృష్టించింది."

- కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ

ఏయే రాష్ట్రాలకు ఎంతెంత?

ఎఫ్​సీఐ ఆహార ధాన్యాలతో పంపించిన 102 రైళ్లలో... గరిష్ఠంగా పంజాబ్​కు 46, తెలంగాణకు 18 కేటాయించారు.

"గోధుమ, ముడి బియ్యాన్ని పంజాబ్​, హరియాణాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. ఉడికించిన బియ్యాన్ని తెలంగాణ నుంచి కేరళ, తమిళనాడు, బంగాల్​కు తరలించారు."

- కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ

భారీ స్థాయిలో...

తాజాగా సరఫరా చేసిన ఆహార ధాన్యాలతో కలిపి... లాక్​డౌన్​ కాలంలో ఎఫ్​సీఐ రవాణా చేసిన మొత్తం ఆహార ధాన్యాలు 50 లక్షల టన్నులు దాటాయి. రోజువారీ సగటు 1.65 లక్షల టన్నులు.

అదే సమయంలో ఎఫ్​సీఐ 4.6 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలను అన్​లోడ్ చేసి.. 9.8 మిలియన్ టన్నులను రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పథకాల కింద (ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ అన్న యోజన సహా) పంపిణీ చేసింది.

పీఎంజీకేవై పథకం కింద ఎఫ్​సీఐ ఇప్పటికే 80 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు 4.23 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసింది. ఫలితంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 5 కిలోల రేషన్​ మూడు నెలల పాటు ఉచితంగా లభిస్తుంది.

రాయితీ ధరతో..

కేంద్ర ప్రభుత్వం 'జాతీయ ఆహార భద్రతా చట్టం' (ఎన్​ఎఫ్​ఎస్​ఏ) కింద ఒక వ్యక్తికి ఒక నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలను అధిక రాయితీ ధరతో అంటే కిలోకు 2-3 రూపాయలకు అందిస్తోంది.

గోధుమల సేకరణ

ఎఫ్​సీఐ ఏప్రిల్​ 22 వరకు మొత్తం 3.38 మిలియన్ టన్నుల గోధుమలు సేకరించింది. వీటిలో పంజాబ్​ ఒక్కటే 2.15 మిలియన్​ టన్నుల వరకు అందించింది. ఈ సీజన్​లో గోధుమ సేకరణ లక్ష్యం 40 మిలియన్ టన్నులు.

ఇదీ చూడండి: ముంబయిలో ఒక్కరోజే 478 కరోనా కేసులు.. 8 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.