ETV Bharat / business

ఆ పోస్టుల్ని లైక్​ చేస్తున్నారా? మీకు వార్నింగ్ ఖాయం! - ఫేస్​బుక్​ న్యూస్​

కరోనా గురించి వచ్చిన పోస్టులన్నింటికీ ఫేస్​బుక్​లో లైక్​ కొడుతున్న వారిలో మీరూ ఒకరైతే.. ఇకపై జాగ్రత్తగా ఉండండి. పొరపాటున ఆ పోస్ట్ వైరస్​పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. ఫేస్​బుక్​ మీకు వార్నింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది.

Facebook to warn users who 'liked' coronavirus hoaxes
కరోనా పోస్టులపై స్పందిస్తున్నారా?.. అయితే జాగ్రత్త
author img

By

Published : Apr 17, 2020, 4:02 PM IST

Updated : Apr 17, 2020, 5:47 PM IST

ఫేస్​బుక్​లో కరోనాపై వచ్చిన పోస్టులకు లైక్​ కొడుతూ, కామెంట్లు పెడుతున్నారా? అయితే జాగ్రత్త. పొరపాటున వైరస్​కు సంబంధించి ఏదైనా అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తే వెంటనే మీకు వార్నింగ్ ఇస్తుంది ఫేస్​బుక్​.

కచ్చితమైన సమాచారం అయితేనే...

వైరస్​పై అసత్య ప్రచారాలను అరికట్టేందుకు ఫేస్​బుక్ సహా​ ఇతర ప్లాట్​ఫాంలు ఇప్పటికే చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. వైరస్​ పుట్టుక, వ్యాక్సిన్ల తయారీ గురించి దుష్ప్రచారం జరుగుతోందని ఫేస్​బుక్​ తెలిపింది. అధికారికంగా ధ్రువీకరించని చికిత్సలు, నివారణలను ప్రోత్సహించే పోస్టులు, వీడియోలను ప్రస్తుతం వేలాది మంది వీక్షించినట్లు పేర్కొంది.

ఇలాంటి అవాస్తవ ప్రకటనలను ఫేస్​బుక్​ నిషేధించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు.. రాష్ట్ర స్థాయి వైద్య విభాగాల నుంచి సేకరించిన సమాచారంతో వైరస్​ గురించి వినియోగదారులకు తెలియజేస్తామని వివరించింది.

అలాగైనా అరికట్టొచ్చు..

ఈ నేపథ్యంలోనే తప్పుదారి పట్టించే సమాచారాన్ని కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 10కిపైగా వార్తా సంస్థలతో భాగస్వామ్యమైంది ఫేస్​బుక్​. ప్రస్తుతం ఇవ్వనున్న హెచ్చరికల కారణంగా సుమారు 95శాతం మంది వినియోగదారులు.. అసత్య వార్తలకు దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

Last Updated : Apr 17, 2020, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.