ETV Bharat / business

ఫేస్​బుక్​లో జోరుగా 'నకిలీ' దందా- 27.5కోట్ల ఖాతాలు ఫేక్ - ఫాల్స్​ ఫేస్​బుక్ ఖాతాలు

ఫేస్​బుక్​కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2.50 బిలియన్ల నెలవారీ క్రియాశీల ఖాతాల్లో 11 శాతం నకిలీవేనని, మరో 5 శాతం తప్పుడు ఖాతాలేనని ఆ సంస్థ వార్షిక నివేదిక తెలిపింది. అభివృద్ధి చెందిన మార్కెట్ల కంటే... ఫిలిప్పీన్స్​, వియత్నాం లాంటి దేశాల్లోనే ఈ నకిలీ ఖాతాలు ఎక్కువగా ఉన్నట్లు ఫేస్​బుక్ గుర్తించింది.

duplicate facebook accounts
ప్రపంచవ్యాప్తంగా 275 మిలియన్ల నకిలీ ఫేస్​బుక్​ ఖాతాలు
author img

By

Published : Feb 13, 2020, 3:20 PM IST

Updated : Mar 1, 2020, 5:29 AM IST

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​లో 27.5 కోట్ల నకిలీ ఖాతాలు ఉన్నట్లు ఆ సంస్థ తాజా వార్షిక నివేదిక తెలిపింది. ఫేస్​బుక్​ మొత్తం ఖాతాల్లో కొంత శాంపుల్​ తీసుకుని, అందులోని నకిలీ, తప్పుడు ఖాతాలను.... అంతర్గత సమీక్ష ద్వారా గుర్తించినట్లు ఆ సంస్థ వివరించింది.

నకిలీ, తప్పుడు ఖాతాలను ఒక కొలమానం ప్రకారం గుర్తించడం సాధ్యం కాదని ఫేస్​బుక్ తెలిపింది. నిజానికి తమ అంచనాల కంటే వీటి సంఖ్య చాలా భిన్నంగా ఉండొచ్చని స్పష్టం చేసింది.

నకిలీ, తప్పుడు ఖాతాలు

2019 డిసెంబర్​ 31 నాటికి ఫేస్​బుక్​కు ప్రపంచవ్యాప్తంగా 2.50 బిలియన్ల నెలవారీ క్రియాశీల ఖాతాదారులు ఉన్నారు. అయితే వీటిలో 11 శాతం అంటే 27.5 కోట్ల ఖాతాలు నకిలీవేనని ఫేస్​బుక్​ గుర్తించింది. అలాగే తప్పుడు ఖాతాలు (ఫాల్స్​ అకౌంట్స్​) 5 శాతం మేర ఉండొచ్చని అంచనా వేసింది.

అభివృద్ధి చెందిన మార్కెట్ల కంటే... ఫిలిప్పీన్స్​, వియత్నాం లాంటి దేశాల్లోనే ఈ నకిలీ ఖాతాలు ఎక్కువగా ఉన్నట్లు ఫేస్​బుక్ గుర్తించింది.

ప్రధాన ఖాతాకు అదనంగా..

ఫేస్​బుక్​ ప్రకారం, యూజర్లు తమ ప్రధాన ఖాతాకు అదనంగా ఓ నకిలీ అకౌంట్​ను నిర్వహిస్తున్నారు.

ఫేస్​బుక్​ నకిలీ ఖాతాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించింది. ఒకటి వినియోగదారుడు తన వ్యాపారం లేదా సంస్థల కోసం వ్యక్తిగత ప్రొఫైల్​ను సృష్టించుకోవడం. మరోరకం పెంపుడు జంతువుల పేరిట ఖాతాలు సృష్టించడం. వీటిని ఫేస్​బుక్ నిబంధనలు ఉల్లంఘించి, స్పామింగ్ లాంటి వాటికి ఉపయోగిస్తున్నట్లు సంస్థ గుర్తించింది.

ఆదరణ పెరిగింది..

2018తో పోల్చితే 2019లో ఫేస్​బుక్​ ఖాతాదారులు 8 శాతం పెరిగారు. భారత్​, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్​లో ఫేస్​బుక్​కు ఆదరణ పెరగడమే ఇందుకు కారణం.

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ క్రియాశీల ఫేస్​బుక్ వినియోగదారులు 2018లో 52 బిలియన్లు ఉండగా, 2019 నాటికి 9 శాతం పెరిగి 1.66 బిలియన్లకు చేరుకున్నారు.

ఇదీ చూడండి: లక్ష కోట్లతో 'వ్యూహాత్మక' సొరంగ మార్గాలు: గడ్కరీ

Last Updated : Mar 1, 2020, 5:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.