ETV Bharat / business

కరోనా మోసాలకు ఫేస్​బుక్​ 'నిషేధం' మందు

కరోనా భయాలను అడ్డంపెట్టుకుని తప్పుడు యాడ్​లు ఇస్తున్న వ్యాపార సంస్థలకు షాక్​ ఇచ్చింది ఫేస్​బుక్​. వైరస్​ను అరికట్టే ఉత్పత్తులుగా నమ్మించే వాణిజ్య ప్రకటనలను నిషేధించింది.

Facebook bans ads with false claims about new virus
కరోనా మోసాలకు ఫేస్​బుక్​ నిషేధం మందు
author img

By

Published : Feb 27, 2020, 11:32 AM IST

Updated : Mar 2, 2020, 5:46 PM IST

"కరోనా నుంచి రక్షించే మాస్క్​ ఇదే... స్టాక్​ చాలా తక్కువ ఉంది... వెంటనే త్వరపడండి"... ఇలాంటి యాడ్​లు ఆన్​లైన్​లో ఎక్కడో చోట చూసే ఉంటారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్​ను బూచిగా చూపి, వ్యాపారం పెంచుకునేందుకు ఇలాంటి తప్పుడు యాడ్​లు ఇస్తున్నారు కొందరు. అలాంటి మోసపూరిత ప్రకటనలపై నిషేధం విధించింది ఫేస్​బుక్.

వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు ఉపకరించే ఉత్పత్తులని చెప్పే ప్రకటనలనూ నిషేధిస్తున్నట్లు ప్రకటించింది ఫేస్​బుక్​. ఉదాహరణకు... "కరోనా నుంచి 100శాతం రక్షణ ఇచ్చే మాస్క్​" అనే యాడ్​లనూ ఇవ్వడం లేదని వివరించింది.

బ్లీచింగ్​ కలిపిన నీరు తాగితేనో, ఫలానా ఉత్పత్తి వాడితేనో కరోనా రాదని చెప్పే అశాస్త్రీయ యాడ్​లు, పోస్ట్​లను ఇప్పటికే నిషేధించింది ఫేస్​బుక్​. కరోనా వచ్చినా... ప్రజలు, వైద్యులను సంప్రదించకుండా ప్రమాదం బారిన పడే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: కరోనాతో స్టాక్ మార్కెట్లకు గండం తప్పదా?

Last Updated : Mar 2, 2020, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.