ETV Bharat / business

'మారటోరియం ఉందని ఈఎంఐ వాయిదా వేస్తే ఇబ్బందే!'

author img

By

Published : May 22, 2020, 3:57 PM IST

రుణాల చెల్లింపుపై మారటోరియాన్ని ఆర్​బీఐ మరోసారి పొడిగించింది. దీంతో ఆదాయ కొరతతో సతమతమవుతున్న రుణగ్రహీతలకు కాస్త ఉపశమనం లభించినట్లైంది. అయితే తప్పని పరిస్థితుల్లోనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మారటోరియం మాత్రమేనని, రుణ మాఫీ కాదని గుర్తు చేస్తున్నారు.

Exrecise caution while opting for loan moratorium
'రుణమాఫీ కాదు మారటోరియం మాత్రమే'

టర్మ్ లోన్ల తిరిగి చెల్లింపుపై మారటోరియాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది రిజర్వు బ్యాంకు. లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణగ్రహీతలకు ఇది కాస్త ఉపశమనం కల్పించేదే.

ఓవైపు ఆహార పదార్థాలు, నిత్యవసరాల ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. ఎక్కువ మంది ఇళ్లలోనే ఉంటున్నారు. వృత్తి నిపుణులు సైతం ఇంటి నుంచే పని చేసుకుంటున్నారు కాబట్టి విద్యుత్ బిల్లులు, ఇంటర్నెట్ బిల్లులు, వైద్య ఖర్చులు సహా ఇతర అత్యవసర సేవల ఖర్చులు భారీగా పెరిగాయి. ఇవన్నీ కుటుంబ ఆదాయ, వ్యయాలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆగస్టు 31 వరకు మారటోరియాన్ని కొనసాగిస్తామంటూ ఆర్​బీఐ గవర్నర్ చేసిన ప్రకటన సహా రేట్ల కోతల నిర్ణయాన్ని ఆర్థిక నిపుణులు స్వాగతిస్తున్నారు.

"వడ్డీ రేట్లలో కోతల వల్ల వ్యక్తిగత రుణాలు, గృహ, వాహన, బంగారం రుణాలు తీసుకునే వారికి ప్రయోజనం కలుగుతుంది. ఉదాహరణకు గృహ రుణంపై ఇదివరకు 8.5 శాతం వడ్డీ చెల్లిస్తే ఇప్పుడు అది 8.1 శాతానికి తగ్గుతుంది. దీని వల్ల వడ్డీపై చెల్లించే డబ్బులు ఆదా అవుతాయి. ప్రజల చేతిలో నగదు మిగులుతుంది."

--సాయికృష్ణ, పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు

అయితే ఈ మారటోరియాన్ని ఉపయోగించుకునే వారికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆర్థికంగా పరిస్థితి తీవ్రంగా దిగజారినప్పుడు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు.

రుణమాఫీ కాదు

శాలరీల్లో కోతలు, ఉద్యోగాలు కోల్పోవడం ఇప్పుడు సర్వ సాధారణంగా మారిపోయాయని, అందువల్ల వీలైనంత వరకు ప్రీమియంలను చెల్లించడమే ఉత్తమమని సూచిస్తున్నారు. ప్రీమియంలను చెల్లించడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక, వైద్య పరమైన అనిశ్చితులను ఎదుర్కోవచ్చని చెబుతున్నారు.

"రుణ చెల్లింపులు ఏవైనా భారమే. రుణాల చెల్లింపును వాయిదా వేయకుండా ప్రీమియం ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తే ఆర్థిక భారాన్ని తొలగించుకోవచ్చు. ఇది రుణ మాఫీ కాదు మారటోరియం మాత్రమేనని గుర్తుంచుకోవాలి."

--సాయికృష్ణ, పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు

రుణాల తిరిగి చెల్లింపుపై ఆర్​బీఐ మార్చిలోనే మూడు నెలల మారటోరియం విధించింది. మే 31తో ముగియనున్న ఈ మారటోరియాన్ని మరో 90 రోజులు పొడగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

అవుట్​స్టాండింగ్​ లోన్లపై వడ్డీ చెల్లించాల్సిందే

ఆర్​బీఐ నిర్ణయంతో లోన్లపై చెల్లించే నెలవారీ ఇన్​స్టాల్​మెంట్(ఈఎంఐ)లు మరో మూడు నెలలు వాయిదా పడనున్నాయి. ఆగస్టు 31 తర్వాతే ఈఎంఐలు ప్రారంభమవుతాయి. అయితే మారటోరియం ఎంచుకున్న రుణగ్రహీతలు చెల్లింపు జరపని కాలానికి అవుట్​స్టాండింగ్ లోన్లపై వడ్డీని సైతం చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: 'వడ్డీ రేట్లు తగ్గింపు- ఈఎంఐలపై మారటోరియం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.