ఆగస్టులో దేశ ఎగుమతులు(Exports of India) 45.17 శాతం పెరిగి 33.14 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.2.45 లక్షల కోట్ల) చేరాయి. దిగుమతులు సైతం 51.47 శాతం పెరిగి 47.01 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3.5 లక్షల కోట్ల) పెరిగాయి. ఫలితంగా వాణిజ్య లోటు 13.87 బిలియన్ డాలర్లకు చేరింది. గతేడాది ఆగస్టులో వాణిజ్య లోటు 8.2 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య శాఖ తాత్కాలిక గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- ఆగస్టులో ఎగుమతులు 66.92 శాతం పెరిగి 163.67 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 81.75 శాతం అధికమై 219.54 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు సైతం 55.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
చమురు దిగుమతులు 80.38% వృద్ధితో 11.64 బి.డాలర్లకు, పసిడి దిగుమతులు 82.22% పెరిగి 6.75 బి.డాలర్లకు చేరాయి.
ఇంజినీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాభరణాలు, రసాయనాల ఎగుమతులు వరుసగా 59 శాతం పెరిగి 9.63 బి.డాలర్లకు, 140 శాతం పెరిగి 4.55 బి.డాలర్లకు, 88 శాతం పెరిగి 3.43 బి.డాలర్లకు, 35.75 శాతం పెరిగి 2.23 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఇదీ చూడండి: EPFO: ఇకపై రెండుగా పీఎఫ్ ఖాతాలు.. నిబంధనలు నోటిఫై చేసిన కేంద్రం