ETV Bharat / business

ఉద్యోగులకు ఈపీఎఫ్‌ ఓ కొత్త సదుపాయం - ఈపీఎఫ్‌

ఉద్యోగులకు ఓ కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారినప్పుడు పీఎఫ్​ ఖాతాలో డబ్బులు బదిలీ చేయడానికి/ విత్​డ్రా చేసుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అలాంటి వారి కోసం ఈపీఎఫ్‌ ఓ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.

epf
ఉద్యోగులకు ఈపీఎఫ్‌ ఓ కొత్త సదుపాయం
author img

By

Published : Jan 23, 2020, 5:28 AM IST

Updated : Feb 18, 2020, 1:58 AM IST

ఉద్యోగులు ఒక సంస్థ నుంచి వేరే కంపెనీకి మారినప్పుడు పీఎఫ్‌ ఖాతాలో డబ్బులు బదిలీ చేయడానికి/ విత్‌డ్రా చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కారణం.. మీరు గతంలో పనిచేసిన సంస్థ.. మీరు ఉద్యోగం నుంచి వైదొలగిన తేదీని ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. కేవలం సదరు కంపెనీలకే ఇప్పటి వరకు ఆ అవకాశం ఉండడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడేవారు. ఒక్కోసారి నెలల తరబడి నగదు బదిలీ చేసుకోవడానికి/ విత్‌డ్రా చేసుకోవడానికి తంటాలు పడేవారు.

అలాంటి వారి కోసం ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇకపై ఉద్యోగులే ఆన్‌లైన్‌లో ఉద్యోగం వైదొలిగిన తేదీని నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అదేంటో తెలుసుకోవాలంటే త్వరగా ఈ స్టోరి చదివేయండి.

నమోదు ఇలా..

ఈపీఎఫ్‌ఓ ఈసేవా పోర్టల్‌లో ఈ వివరాలను మార్చుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఉద్యోగులు తమ యూఏఎన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. ‘మేనేజ్‌’ టాబ్‌లోకి వెళ్లి ‘మార్క్‌ ఎగ్జిట్‌’లోకి వెళ్లాలి. మీరు గతంలో పనిచేసిన సంస్థ నుంచి ఉద్యోగంలోంచి వైదొలిగిన తేదీ, కారణాన్ని అక్కడ తెలపాలి.

ఆ తర్వాత ఓటీపీ కోసం రిక్వెస్ట్‌ పెట్టి.. అనంతరం ఓటీపీని ఎంటర్‌ చేయాలి. చివర్లో అప్‌డేట్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఈపీఎఫ్‌ఓ రికార్డుల్లో మీరు వైదొలిగిన తేదీని నమోదు చేయొచ్చు. అయితే, ఈ ప్రక్రియ పూర్తి చేసే ముందు అంతకుముందు మీరు పనిచేసిన కంపెనీ సదరు వివరాలు నమోదు చేసిందీ లేనిదీ ఓ సారి తనిఖీ చేసుకోవడం ఉత్తమం. అయితే, ఈ తేదీ నమోదు చేయాలంటే మీరు ఉద్యోగం నుంచి వైదొలిగి కనీసం రెండు నెలలు అయ్యి ఉండాలి. పాత కంపెనీ మీ పీఎఫ్‌ ఖాతాలో చివరిసారిగా జమ చేసి రెండు నెలల దాటిన తర్వాతే ఈ మార్పులు చేసేందుకు వీలుంటుంది.

epf
ఉద్యోగులకు ఈపీఎఫ్‌ ఓ కొత్త సదుపాయం

ఇదీ చూడండి.. న్యూజిలాండ్​తో వన్డే సిరీస్​కు భారత జట్టిదే

Intro:Body:

एंकर-डूंगरपुर जिले में पंचायत चुनाव के दूसरे चरण में बीटीपी विधायक राजकुमार रोत की पंचायत मांडेला उपली में मतगणना के बाद उपद्रव हो गया। हारने वाले बीटीपी समर्थक सरपंच उम्मीदवार के समर्थकों ने मतदान केंद्र में घुसकर जमकर उत्पात मचाया वही दो बोलेरो जीप व एक बाइक को आग के हवाले कर दिया। वही उपद्रवियो ने मतदान केंद्र में पथराव भी किया। इस दौरान मतदान कर्मियों व अन्य उम्मीदवारों ने मतदान केंद्र के कमरों में घुसकर अपनी जान बचाई। हालांकि पथराव में एक पुलिसकर्मी घायल हुआ है। वही उपद्रव के दौरान पुलिस ने आंसू गैस के गोले छोड़े ओर उपद्रवियों को खदेड़ा। इधर उपद्रव की सूचना पर डूंगरपुर से अतिरिक्त सुरक्षा बल, एसपी जय यादव व एडीएम कृष्णपाल सिंह चौहान भी मौके पर पहुंचे। मामले में पुलिस ने 3 उपद्रवियों को हिरासत में लिया है। फिलहाल मौके पर भारी पुलिस बल तैनात है।

Conclusion:
Last Updated : Feb 18, 2020, 1:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.