ETV Bharat / business

'రూ.44వేల కోట్లిస్తా.. పేదల ఆకలి ఎలా తీర్చుతారో చెప్పండి' - ఎలాన్ మస్క్ వార్తలు

ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు నిర్మూలించేందుకు 6 బిలియన్ డాలర్లు(రూ.44వేల కోట్లు) విరాళంగా ఇస్తానని, కానీ ఎలా దీన్ని చేసి చూపిస్తారో చెప్పాలని ఐరాసకు సవాల్ విసిరారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్​. ఐరాస అధికారి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు.

elon musk
ఎలాన్ మస్క్​
author img

By

Published : Nov 2, 2021, 1:42 PM IST

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, స్పేస్ ఎక్స్​ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్.. ఐక్యరాజ్యసమితికి ఓ సవాల్ విసిరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకలి సమస్యను తీర్చేందుకు తాను 6 బిలియన్ డాలర్లు(రూ.44వేల కోట్లు) విరాళంగా ఇస్తానని, అవసరమైతే తక్షణమే టెస్లా షేర్లు విక్రయిస్తానని తెలిపారు. కానీ డబ్బుతో ఆకలి కేకలను ఐరాస ఎలా నిర్మూలిస్తుందో వివరించాలని ట్వీట్ చేశారు.

ఐరాస ఆహార కార్యక్రమం(WFP) డైరెక్టర్ డేవిడ్​ బీస్లీ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచ సంపన్నులైన ఎలాన్ మస్క్, జెఫ్​ బెజోస్ వంటి వారు తమ సంపదలో 2శాతాన్ని విరాళంగా ఉస్తే ప్రపంచం ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను తీర్చవచ్చన్నారు. 6 బిలియన్ డాలర్లు చెల్లిస్తే ఆకలితో అలమటించి చనిపోబోతున్న 42లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు.

ఈ వ్యాఖ్యల అనంతరమే మస్క్ ఆదివారం ట్వీట్ చేశారు. ​తాను 6 బిలియన్ డాలర్లు ఇస్తానని, కానీ ఆకలి సమస్యను ఎలా తీర్చుతారో, నిధులను ఎలా ఖర్చు చేస్తారో వివరించాలన్నారు. అప్పుడే ప్రజలకు నిధులు ఎలా ఖర్చవుతున్నాయో తెలుస్తుందన్నారు.

మస్క్ ట్వీట్​కు డేవిడ్​ బీస్లీ స్పందించారు. '6 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో ఆకలి సమస్య తీరకపోవచ్చు, కానీ భౌగోళిక రాజకీయ అస్థిరత్వాన్ని, సామూహిక వలసలను నియంత్రించవచ్చు. ఆకలితో అలమటిస్తున్న 42లక్షల ప్రాణాలను కాపాడవచ్చు. కరోనా, వాతావరణ మార్పు కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని తీర్చవచ్చు. అవసరమైతే ఈ విషయంపై క్లుప్తంగా వివరించేందుకు మీతో(మస్క్​తో) ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు సిద్ధం. భూమిపై లేదా అంతరిక్షంలో ఎక్కడైనా భేటీ అవుతా' అని అన్నారు.

బిలియనీర్లకు సాధ్యమా?

ఆక్స్​ఫామ్​ ప్రకారం.. ప్రపంచంలోని తొలి 2,153 మంది కుబేరుల సంపద... 460 కోట్ల మంది​ ప్రజల సంపదకన్నా ఎక్కువే! ఈ విధంగా చూసుకుంటే.. సంపన్నులు తలుచుకుంటే పేదరికాన్ని ఇట్టే మాయం చేయగలరనిపిస్తుంది. కుబేరులైన జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్​ వంటి వారు ఉదారంగా ప్రజలకు తమ సంపదను పంచేస్తే అందరూ సుఖసంతోషాలతో జీవించగలరనిపిస్తుంది. కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే వారి సంపద చాలావరకు ఆస్తుల రూపంలోనే ఉంటుంది. నోట్ల కట్టలుగా ఉండదు.

ఉదాహరణకు.. ఇప్పుడు బిలియనీర్లు వారి సంపదను పేదలకు ఉచితంగా పంచేస్తున్నారని అనుకుందాం. అందులో వారి కంపెనీ షేర్లు కూడా ఉంటాయి. వాటిని విరాళంగా ఇవ్వలేరు. అమ్మాల్సి వస్తుంది. అంత మొత్తాన్ని అమ్మడం మొదలుపెడితే.. అమ్మకాల ఒత్తిడి తట్టుకోలేక, కంపెనీ భారీ నష్టాల్లోకి జారుకుంటుంది. కంపెనీ దివాలా తీసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇదే జరిగితే.. షేర్​ హోల్డర్లు పేదోళ్లుగా మారిపోతారు!

అందువల్ల పేదరికాన్ని నిర్మూలించడం పూర్తిగా బిలియనీర్ల చేతిలో లేదు. కానీ ఈ బిలియనీర్లలో చాలా మంది.. విరాళాలు ఇస్తూ, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తూ పేదలకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తున్నారు.

ఇదీ చదవండి: 2025 నాటికి భారత్‌లో 'టెస్లా' కార్ల ఉత్పత్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.