ఐఫోన్లు తయారుచేసే ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫాక్స్కాన్ ఇప్పుడు సర్జికల్ మాస్క్లు తయారుచేస్తోంది. కరోనా వైరస్ విజృంభణతో చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మాస్కుల కొరత ఏర్పడింది. అందువల్ల ఫాక్స్కాన్ ఐఫోన్ల తయారీని పక్కన పెట్టి, యుద్ధ ప్రాతిపదికన మాస్కుల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ నెల చివరినాటికి రోజులు 20 లక్షల మాస్కులు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సామాజిక బాధ్యతగా
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఎంత వేగంగా నివారణ చర్యలు తీసుకుంటే.. అంత మంది ప్రాణాలను కాపాడుగలుగుతామని ఫాక్స్కాన్ పేర్కొంది. దక్షిణ చైనాలోని షెంజాన్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా మాస్కుల తయారీ మొదలుపెట్టినట్లు వెల్లడించింది. ఇది కార్పొరేట్ బాధ్యతగా కాకుండా, సామాజిక బాధ్యతగా చేస్తున్నామని తెలిపింది.
కరోనా పరీక్షలు
ఫాక్స్కాన్ తమ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఇన్ఫ్రారెడ్ టెంపరేచర్ మెజర్మెంట్ ఎక్విప్మెంట్ ఉపయోగిస్తోంది.
యూనిట్లు తెరవాలని వినతి
కరోనా వైరస్ ప్రబలిన తరువాత ఫాక్స్కాన్ తన యూనిట్లలో కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే ఇప్పుడు వాటిని తెరిచేందుకు అనుమతివ్వాలని అధికారులను కోరుతోంది.
చైనాలో కర్మాగారాల మూసివేత, ప్రయాణాలపై ఆంక్షల వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనిపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ అయిన ఫాక్స్కాన్... ఐఫోన్లు, ఐపాడ్, అమెజాన్ కిండిల్, ప్లేస్టేషన్ లాంటి అనేత ఎలక్ట్రానిక్ పరికరాలను తయారుచేస్తుంది.
ఇదీ చూడండి: ఆటో ఎక్స్పో 2020: కళ్లు చెదిరే కార్లు.. అదిరే మోడళ్లు