ETV Bharat / business

ఏప్రిల్‌ 3, 4న హైటెక్స్‌లో 'ఈనాడు ప్రాపర్టీ షో' - హైటెక్ సిటీలో ఈనాడు ప్రాపర్టీ షో

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న ‘ఈనాడు ప్రాపర్టీ షో’ మరలా మీ ముందుకు వచ్చేసింది. ఇప్పటికి ౩౦ ఎడిషన్స్ విజయవంతంగా నిర్వహించిన ‘ఈనాడు ప్రాపర్టీ షో’ తన 31వ ఎడిషన్ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఏప్రిల్ 3, 4వ తేదీల్లో నిర్వహిస్తోంది. ఇది హైదరాబాద్​లోనే అతి పెద్ద ప్రాపర్టీ షోగా నిలవనుంది. మీ అన్వేషణ ప్రీమియం విల్లా అయినా, బడ్జెట్ హౌస్ అయినా, ప్లాట్స్‌, ఫ్లాట్స్‌ అయినా, మీ కలలను నిజం చేసుకునే సువర్ణ అవకాశం ‘ఈనాడు ప్రాపర్టీ షో’.

eenadu-property-show-at-hitex-city-on-april-month
ఏప్రిల్‌ 3, 4న హైటెక్స్‌లో ‘ఈనాడు ప్రాపర్టీ షో’
author img

By

Published : Mar 15, 2021, 5:53 PM IST

ఇప్పుడు దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోంది. కొత్త సంవత్సరంలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఊపందుకున్నాయి. గృహ, రుణ వడ్డీ రేట్లు తగ్గడంతో, రుణాలు తీసుకుని ఫ్లాట్లు, విల్లాలు, స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వీటన్నింటికి విపరీతమైన డిమాండ్ వచ్చింది. నగరం చుట్టూ వివిధ కొత్త ప్రాజెక్టులు వస్తుండడం, ప్రభుత్వాలు కూడా వీటికి ప్రాధాన్యం ఇస్తుండడంతో, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి.

కొంపల్లి వైపు ఐటీ సంస్థల ఏర్పాటు, ఉప్పల్ వైపు మైక్రోసాఫ్ట్ సంస్థ కార్యాలయాలు, విజయవాడ, బెంగుళూరు జాతీయ రహదారి వైపు లాజిస్టిక్ పార్కులు, ఇలా నగరంలో నలువైపులా అభివృద్ధి ఊపందుకోవడంతో నగరానికి వలసలు పెరిగాయి. ఇప్పటికే ఐటీ కేంద్రంగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి చుట్టూ పక్కల ప్రాంతాలలో పలు కంపెనీల విస్తరణతో చుట్టూ పది కిలోమీటర్ల వరకు గృహ నిర్మాణం ఊపందుకుంది. కొండాపూర్, కోకాపేట, రాయదుర్గం, నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది. ఎల్బీ నగర్‌ ప్రాంతానికి మెట్రో సౌకర్యం రావడంతో ఈ చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో డిమాండ్ ఊపందుకుంది. అటు ఉప్పల్ వైపు కూడా మెట్రో రాకతో చాలా మంది ఇంటరెస్ట్ చూపుతున్నారు.

ప్రజలకు అన్ని వెంచర్స్ ఒకే వేదికపై తీసుకురావడంతో పాటు, బ్యాంకు లోన్స్ వివరాలు అక్కడికక్కడే తెలుసుకోవడానికి వీలుగా వివిధ బ్యాంక్స్ కూడా ఇక్కడ తమ స్టాల్ల్స్​ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇంకా ఇంటీరియర్ డెకొరేటర్స్, సోలార్, ఇతర గృహ సంబంధిత సంస్థలు కూడా తమ స్టాల్స్‌ని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 'ఈనాడు ప్రాపర్టీ షో' తన 31వ ఎడిషన్​ను​ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్​లో ఏప్రిల్ 3,4వ తేదీల్లో నిర్వహిస్తోంది.

ఇదీ చూడండి: బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.