ETV Bharat / business

Sputnik-V: స్పుత్నిక్‌-వి టీకా సరఫరా ప్రారంభం - తెలంగాణ తాజా వార్తలు

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వి’ తొలిడోసు సరఫరా ప్రారంభించినట్టు డా.రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ మంగళవారం వెల్లడించింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ స్పుత్నిక్‌-వి టీకా లభ్యత గురించి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

sputnik v
sputnik v
author img

By

Published : Sep 8, 2021, 6:46 AM IST

రష్యాకు చెందిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-వి’ తొలిడోసు సరఫరా ప్రారంభించినట్టు డా.రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ మంగళవారం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా తాము ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రులకు వీటిని పంపుతున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ స్పుత్నిక్‌-వి టీకా లభ్యత గురించి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

వేరియంట్ ఏదైనా..

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లు మాత్రం టీకాల పనితీరుకు ఓ సవాలుగా మారుతున్నాయి. ఇప్పటికే వినియోగిస్తోన్న టీకాలు కొన్ని వేరియంట్లను ఎదుర్కోగలుగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. తాజాగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ కూడా కొత్తగా బయటపడుతోన్న వేరియంట్లను తటస్థీకరించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు తొలుత వుహాన్‌లో వెలుగుచూసిన వైరస్‌ స్ట్రెయిన్‌ ఆధారంగా రూపొందించారు. కానీ, రోజురోజుకు రూపాంతరం చెందుతోన్న వైరస్‌, ప్రమాదకర వేరియంట్లుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆల్ఫా, బీటా, గామాతో పాటు అత్యంత ప్రమాదకరమైందిగా భావిస్తోన్న డెల్టా వేరియంట్‌ను తటస్థీకరించడంలో స్పుత్నిక్‌-వి మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు వ్యాక్సిన్‌ తయారీ సంస్థ ఆర్‌డీఐఎఫ్‌ వెల్లడించింది. ఇందుకోసం స్పుత్నిక్‌ టీకా తీసుకున్నవారి రక్త నమూనాలను సేకరించి పరిశీలించినట్లు తెలిపింది.

వేగంగా ఉత్పత్తి ప్రక్రియ

దేశీయంగా తయారుచేసిన స్పుత్నిక్-వీ(Sputnik-V ) వ్యాక్సిన్​ను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ చర్యలు వేగవంతం చేసింది. మేలో స్పుత్నిక్ వ్యాక్సిన్​ను దేశంలో సాఫ్ట్ లాంఛ్ చేసిన డాక్టర్ రెడ్డీస్.. ప్రారంభంలో వ్యాక్సిన్ డోసులను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్(RDIF) నుంచి దిగుమతి చేసుకుంటూ దేశంలో సరఫరా చేస్తూ వచ్చింది.

దేశీయంగా స్పుత్నిక్(Sputnik-V ) వ్యాక్సిన్ తయారీకి డాక్టర్ రెడ్డీస్​తో పాటు.. ఆరు డ్రగ్ కంపెనీలతో ఈమేరకు ఆర్​డీఐఎఫ్​ ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్ డోసుల దిగుమతి, సొంత ఉత్పత్తి ద్వారా 250 మిలియన్ స్పుత్నిక్ -వీ డోసులను దేశంలో సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ పూనుకుంది.

ఆర్‌డీఐఎఫ్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ వినియోగానికి భారత్‌ ఇదివరకే అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ ప్రస్తుతం ప్రైవేటులోనే ఎక్కువగా అందుబాటులో ఉంది. అయితే, రెండో డోసు కొరత ఏర్పడిందని.. దీంతో తొలిడోసు తీసుకున్న వారికి ఆలస్యం అవుతోందనే వార్తలు గతంలో వచ్చాయి. దీనిపై స్పందించిన ఆర్‌డీఐఎఫ్‌, అలాంటి నివేదికల్లో నిజం లేదని తెలిపింది. రానున్న రోజుల్లో స్పుత్నిక్‌ తయారీకి భారత్‌ కేంద్ర బిందువుగా మారనుందని అభిప్రాయపడింది.

ఇదీ చూడండి: కొవిషీల్డ్​ పంపిణీపై కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.