ETV Bharat / business

'ఏక్​దమ్'​గా బిర్యానీ మార్కెట్లోకి డోమినోస్ - gurugram

పిజ్జాలు తయారుచేయడంలో ప్రఖ్యాతిగాంచిన డోమినోస్ ఇప్పుడు వినియోగదారులకు బిర్యానీ రుచులను కూడా అందించనుంది. బిర్యానీ ప్రియులను మెప్పించేందుకు 'ఏక్​దమ్'​ పేరుతో మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను జూబ్లెంట్ ఫుడ్​ వర్క్స్​ లిమిటడ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

biriyani, dominos, ekdum
డామినోస్ ఏ​క్​దమ్​
author img

By

Published : Dec 18, 2020, 5:21 AM IST

Updated : Dec 18, 2020, 5:58 AM IST

దేశవ్యాప్తంగా ఆహార ప్రియులు ఇష్టపడే పదార్థాల్లో బిర్యానీ తొలివరుసలో ఉంటుంది. భారతీయ ఆహార రంగంలో భారీ డిమాండ్ దీని సొంతం. ఈ నేపథ్యంలో బిర్యానీ ప్రియులను మెప్పించేందుకు ప్రముఖ అంతర్జాతీయ ఆహార సంస్థ డోమినోస్ పిజ్జా సిద్ధమౌతోంది. 'ఏక్​దమ్​' అనే పేరుతో తాము బిర్యానీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు 'జుబ్లెంట్ ఫుడ్ వర్క్స్' లిమిటెడ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. తమ బిర్యానీ తొలుత గురగ్రామ్​లోని మూడు రెస్టారెంట్లలో లభిస్తుందని.. అనంతరం దిల్లీ తదితర ముఖ్య పట్టణాల్లో కూడా అందజేస్తామని ఈ సంస్థ వెల్లడించింది. తమ సేవలు యాప్, వెబ్​సైట్లలో కూడా అందుబాటులో ఉంటాయని జేఎఫ్​ఎల్​ తెలిపింది.

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన హైదరాబాదీ నిజామీ బిర్యానీ, లఖ్​నవీ నవాబ్​ బిర్యానీ, కోల్​కతా బిర్యానీ, బటర్ చికెన్ బిర్యానీ తదితర 20 రకాల బిర్యానీలను వినియోగదారులకు అందజేయనున్నామని జేఎఫ్ఎల్ వివరించింది. శాఖాహార, మాంసాహార బిర్యానీలను వేర్వేరు వంటశాలల్లో తయారు చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు కబాబ్​లు, స్వీట్స్ కూడా లభిస్తాయని తెలిపారు. ఆహారాన్ని చెదరని, పర్యావరణ హితమైన ప్రత్యేక దమ్​ సీలుతో అందచేస్తారట. వీటి ధరలు రూ.99 నుంచి ప్రారంభమవుతాయని సంస్థ యాజమాన్యం అంటోంది.

జెఎఫ్​ఎల్​కు దేశంలోని 281 పట్టణాలు, నగరాల్లో డోమినోస్​ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. అంతే కాకుండా దేశంలోని ఎనిమిది నగరాల్లో 26 డంకిన్ డోనట్స్​ రెస్టారెంట్లను కూడా నిర్వహిస్తోంది. భారత్​తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్​లో కూడా ఈ సంస్థ కార్యకలాపాలు విస్తరించాయి.

​ఇదీ చూడండి : స్థానిక భాషల్లో మరింత మందికి చేరువగా గూగుల్​!

Last Updated : Dec 18, 2020, 5:58 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.