ETV Bharat / business

రూ. లక్ష కోట్ల దివీస్​.. మార్కెట్​ విలువలో రికార్డు - దివీస్ షేరు విలువ రెట్టింపు

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దివీస్‌ లేబొరేటరీస్‌ కొత్త రికార్డు సృష్టించింది. స్టాక్​మార్కెట్లలో ఆ సంస్థ షేరు ధర రూ.3,800 ను అధిగమించింది. దీంతో మార్కెట్ విలువలో రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీగా అవతరించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్థాయికి చేరిన మొదటి సంస్థ ఇదే కావడం గమనార్హం.

divis-laboratories-new-record-in-stock-market
స్టాక్​​మార్కెట్​ విలువలో సత్తా చాటిన 'దివీ'స్ ​
author img

By

Published : Dec 18, 2020, 8:25 AM IST

Updated : Dec 18, 2020, 9:26 AM IST

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దివీస్‌ లేబొరేటరీస్‌ రూ. లక్ష కోట్ల 'మార్కెట్‌ విలువ (కేపిటలైజేషన్‌)' ను అధిగమించి రికార్డు సృష్టించింది. గురువారం ..స్టాక్‌మార్కెట్లలో దివీస్‌ షేరు ధర రూ.3,800 కంటే మించింది. ఎన్‌ఎస్‌ఈ (నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి) లో ముగింపు ధర అయిన రూ.3,830 ప్రకారం ఈ కంపెనీ మార్కెట్‌ కేపిటలైజేషన్‌ రూ.1,01,674 కోట్లకు చేరుకుంది. తద్వారా కంపెనీ వాటాదార్లకు అనూహ్య సంపద సృష్టించినట్లు అయింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇటువంటి అరుదైన ఘనత సాధించిన కంపెనీ ఇదే కావడం గమనార్హం. దేశంలో రూ.1 లక్ష కోట్ల మార్కెట్‌ కేపిటలైజేషన్‌ సాధించిన రెండో ఫార్మా కంపెనీ కూడా దివీస్‌ మాత్రమే. మొదటి స్థానంలో సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఉంది. దివీస్‌ ల్యాబ్స్‌ భవిష్యత్తు వృద్ధి అవకాశాలపై నమ్మకం ఉండటంతో మదుపరులు ఈ కంపెనీ షేరుకు అధిక ధర చెల్లించేందుకు సిద్ధపడుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థానికి ఏకీకృత ఖాతాల ప్రకారం దివీస్‌ ల్యాబ్స్‌ రూ.3,506 కోట్ల మొత్తం ఆదాయాన్ని, రూ.1012 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. ఈ కంపెనీ తయారు చేసే ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) ఔషధాలు, కస్టమ్‌ సింథసిస్‌ కార్యకలాపాలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ అధికంగా ఉంది. కంపెనీకి అప్పు లేకపోగా, ఔషధ నియంత్రణ సంస్థల నుంచి ఇబ్బందులు కూడా లేవు. దీనికి తోడు ఉత్పత్తి సామర్థ్యాన్ని యాజమాన్యం ఇంకా విస్తరిస్తోంది. హైదరాబాద్‌ సమీపంలోని చౌటుప్పల్‌, విశాఖపట్నం వద్ద గల యూనిట్ల సామర్థ్యాన్ని పెద్దఎత్తున విస్తరిస్తోంది. రూ.1500 కోట్లతో కాకినాడలో మరో కొత్త యూనిట్‌ నిర్మిస్తోంది. కాకినాడ యూనిట్‌ ఏడాదిన్నర వ్యవధిలో అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ విస్తరణ ఫలితంగా 2022 తర్వాత దివీస్‌ ల్యాబ్స్‌ ఆదాయాలు, లాభాల్లో ఇంకా వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

divis-laboratories-new-record-in-stock-market
స్టాక్​​మార్కెట్​ విలువలో సత్తా చాటిన 'దివీ'స్ ​

ఏడాది లోపే షేరు విలువ దాదాపు రెట్టింపు

ఈ ఏడాదిలో దివీస్‌ ల్యాబ్స్‌ షేరు ధర బాగా పెరిగింది. 2020 ప్రారంభంలో ఈ షేరు ధర రూ.1860 దరిదాపుల్లో ఉండేది. ఏడాది చివరి నాటికి ఇది రెట్టింపు అయింది. కొవిడ్‌-19 వల్ల దేశీయ ఫార్మా కంపెనీల అమ్మకాలు, ఆదాయాలు బాగా పెరిగిన విషయం విదితమే. దానికి అనుగుణంగా అన్ని ఫార్మా కంపెనీల షేర్ల ధరలు రెట్టింపు కావటం లేదా ఇంకా మించిపోవడం జరిగాయి. అదే కోవలో దివీస్‌ ల్యాబ్స్‌ షేరు ధర పెరిగింది. దివీస్‌ లేబొరేటరీస్‌ను ఆ సంస్థ వ్యవస్థాపకుడైన డాక్టర్‌ మురళి కే.దివి 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా సంస్థ ఎదిగింది. మూడు దశాబ్దాలు పూర్తిచేసుకున్న తరుణంలో రూ.లక్ష కోట్ల మార్కెట్‌ కేపిటలైజేషన్‌ సాధించటం ఆసక్తికర విషయంగా స్టాక్‌మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఎంతో వృద్ధి!

దివీస్‌ లేబొరేటరీస్‌ 2003 ఫిబ్రవరిలో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. రూ. 10 ముఖ విలువ కలిగిన షేరును రూ.130కి జారీ చేసింది. 2007లో ప్రతి షేరును రూ.2 ముఖ విలువ కలిగిన 5 షేర్లుగా విభజించింది. అంటే 2003లో కొనుగోలు చేసిన ఒకషేరు 5 షేర్లుగా మారింది. తదుపరి 2009లో 1:1 చొప్పున బోనస్‌ షేర్లు జారీ చేసింది. ఫలితంగా 5 షేర్లు 10గా మారాయి. 2015లోనూ మరోవిడత 1:1 చొప్పున బోనస్‌ షేర్లు జారీ చేసింది. అంటే ఈ 10 షేర్లు 20 షేర్లు అయ్యాయి. 2003లో ఒక షేరు కొనుగోలు చేసినవారు, అట్టేపెట్టుకుంటే, ఇప్పుడు 20 షేర్లు అయ్యాయన్నమాట. ఈ లెక్కన ప్రస్తుత షేరు విలువ ప్రకారం వారు భారీగా లాభాలు ఆర్జించినట్లే.

ఇదీ చదవండి: మార్చి నుంచి అందుబాటులోకి 'స్పుత్నిక్ వి'​ టీకా!

Last Updated : Dec 18, 2020, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.