ETV Bharat / business

కార్ల విక్రయాలు భళా.. ట్రాక్టర్ల అమ్మకాలు డీలా! - ఫాడా వాహన విక్రయ గణాంకాలు

ఆటోమొబైల్ రిటైల్​ విక్రయాలు గత నెల భారీగా తగ్గాయి. సెప్టెంబర్​లో మొత్తం 12,96,257 వాహనాలు విక్రయమైనట్లు ఫాడా వెల్లడించింది. కార్లు, వాణిజ్య వాహనాల విక్రయాలు పెరిగినప్పటికీ.. ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాల అమ్మకాల్లో భారీ క్షీణత నమోదైనట్లు తెలిపింది.

Car sales rise in India
పెరిగిన కార్ల విక్రయాలు
author img

By

Published : Oct 7, 2021, 4:48 PM IST

దేశవ్యాప్తంగా సెప్టెంబర్​లో వాహనాల రిటైల్ విక్రయాలు గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 5 శాతానికిపైగా తగ్గాయని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య 'ఫాడా' ప్రకటించింది. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల విక్రయాల్లో భారీ క్షీణతే ఇందుకు కారణంగా తెలిపింది. కార్లు, వాణిజ్య వాహనాలు, త్రీ వీలర్స్ విక్రయాలు మాత్రం పెరిగినట్లు వెల్లడించింది ఫాడా.

ఫాడా నివేదికలో మరిన్ని విశేషాలు..

  • గత నెలలో మొత్తం 12,96,257 వాహనాలు విక్రయమయ్యాయి. 2020 సెప్టెంబర్​లో ఈ సంఖ్య 13,68,307గా ఉంది.
  • 2020 సెప్టెంబర్​లో 10,33,895 ద్విచక్రవాహనాలు అమ్ముడయ్యాయి. గత నెల వీటి రిటైల్ విక్రయాలు 11.54 శాతం క్షీణతతో 9,14,621 యూనిట్లకు పడిపోయాయి.
  • ట్రాక్టర్ల రిటైల్ విక్రయాలు ఈ ఏడాది సెప్టెంబర్​లో ఏకంగా 23.85 శాతం పడిపోయాయి. గత నెల మొత్తం 52,896 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020 సెప్టెంబర్​లో 69,462 ట్రాక్టర్లు విక్రయమయ్యాయి. కరోనా కాలంలో కూడా ఈ తగ్గని ట్రాక్టర్ల విక్రయాలు గత నెలలో భారీగా క్షీణించడం గమనార్హం.
  • కార్ల రిటైల్ విక్రయాలు గత నెల 16.32 శాతం పెరిగి.. 2,33,308 యూనిట్లకు చేరాయి. 2020 సెప్టెంబర్​లో ఈ సంఖ్య 2,00,576 యూనిట్లుగా ఉండటం గమనార్హం.
  • గత నెలలో వాణిజ్య వాహనాల రిటైల్​ విక్రయాలు 46.64 పుంజుకున్నాయి. మొత్తం 36,612 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 24,262 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​-సెప్టెంబర్​ మధ్య 71,85,561 వాహనాల రిటైల్ విక్రయాలు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ మొత్తం 35 శాతం ఎక్కువ.

ఇదీ చదవండి: ఐబీపీఎస్​ క్లర్క్​ పోస్టులకు నోటిఫికేషన్- మాతృ భాషలోనే పరీక్ష!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.