గత కొన్ని రోజులుగా దాదాపు స్థిరంగా ఉన్న డీజిల్ ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. దాదాపు 21 రోజుల తర్వాత కూడా పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు చమురు మార్కెటింగ్ సంస్థలు.
రికార్డు స్థాయికి డీజిల్..
లీటర్ డీజిల్పై సోమవారం 12 పైసలు పెరిగింది. దీనితో దిల్లీలో డీజిల్ లీటర్కు జీవనకాల గరిష్ఠం వద్ద రూ.81.64కు చేరింది. ఇతర ప్రధాన నగరాల్లోనూ డీజిల్ ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ డీజిల్ ధర పెట్రోల్ (లీటర్)తో పోలిస్తే రూ.6-8 వరకు తక్కువగా ఉంది.
అయితే జూన్ 29 నుంచి పెట్రోల్(లీటర్) ధర మాత్రం దాదాపు రూ.80.43 వద్ద స్థిరంగా ఉంది. ప్రస్తుతానికి దిల్లీలో మాత్రమే డీజిల్ ధర పెట్రోల్ కన్నా ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో మిగతా మెట్రో నగరాల్లోనూ పెట్రోల్ కన్నా డీజిల్ ధర ప్రియం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు.
డిమాండ్ మందగమనంగా ఉన్నప్పటికీ.. డీజిల్పై సుంకాల పెంపు ద్వారా ఖజానా నింపుకోవాలని ప్రభుత్వాలు భావిస్తుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఇదీ చూడండి:తప్పు జరిగింది.. క్షమించండి: ట్విట్టర్