ETV Bharat / business

అంతర్జాతీయ విమాన సర్వీసులపై జూన్​ 30 వరకు నిషేధం

కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై జూన్​ 30 వరకు నిషేధం పొడిగించింది పౌర విమానయాన శాఖ. దేశీయ విమాన సర్వీసుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు జారీ చేసింది.

DGCA to airlines
అతర్జాతీయ విమాన సర్వీసులపై ఈనెల 30 వరకు నిషేధం
author img

By

Published : Jun 1, 2020, 3:18 PM IST

దేశంలో కరోనా వైరస్​ వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని ఈనెల 30 వరకు పొడిగించింది పౌర విమానయాన శాఖ. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఎవియేషన్​ (డీజీసీఏ) డైరెక్టర్​. అయితే సరకు రవాణాపై నిషేధాజ్ఞలు ఉండవని స్పష్టం చేశారు.

మధ్య సీట్లు ఖాళీగా ..

దేశీయ విమాన సేవలు ప్రారంభమైన నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది డీజీసీఏ. సీట్ల నిర్వహణలో భాగంగా మధ్య సీటును ఖాళీగా ఉంచాలని ఎయిర్​లైన్స్​కు సూచించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండి మధ్య సీటును కేటాయించినట్లయితే అదనపు రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కేంద్ర జౌళి శాఖ అనుమతించిన ప్రమాణాలతో వ్యక్తిగత భద్రత గౌను, మాస్కు వంటివి తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొంది.

రెండు నెలల లాక్​డౌన్​ తర్వాత మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులను పునరుద్ధరించింది భారత్​.

DGCA to airlines
డీజీసీఏ మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.