ETV Bharat / business

ఈ ఏడాది 3 కరోనా డ్రగ్స్​కు డీసీజీఐ ఆమోదం - కరోనా మందులు

ఈ ఏడాది ఇప్పటివరకు 25 కొత్త ఔషధాలకు డీసీజీఐ ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో రెమ్​డెసివిర్, ఫావిపిరవిర్​ సహా మొత్తం మూడు కరోనా ఔషధాలు ఉన్నట్లు తెలిపారు.

DCGI approves 3 COVID drugs among 25 others
ఈ ఏడాది 3 కరోనా ఔషధాలకు డీసీజీఐ ఆమోదం
author img

By

Published : Aug 22, 2020, 9:34 PM IST

భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ).. ఈ ఏడాది 25 కొత్త ఔషధాలకు ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. అందులో మూడు కరోనా వైరస్ ఔషధాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

కరోనా బాధితుల చికిత్స కోసం రెమ్​డెసివిర్ ఇంజెక్షన్ (5 మి.లీ), రెమ్​డెసివిర్ లైయోఫిలైస్డ్​ పౌడర్ ఫర్ ఇంజెక్షన్ (100 మి.గ్రా) డ్రగ్స్​కు డీసీజీఐ ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలిపారు. ఫావిపిరవిర్​ ట్యాబ్లెట్లను సైతం.. స్పల్ప లక్షణాలు ఉన్న కరోనా రోగుల కోసం ఉపయోగించేందుకు అనుమతించినట్లు చెప్పారు. మరోవైపు దీర్ఘకాల మూత్రపిండ వ్యాధి ఉన్న రోగుల్లో సీరం ఫాస్పరస్ స్థాయిలను నియంత్రించే సుక్రోఫెర్రిక్ ఆక్సీహైడ్రాక్సైడ్ ఔషధాన్ని ఈ ఏడాది డీసీజీఐ ఆమోదించినట్లు వివరించారు.

మరోవైపు ఫార్మా దిగ్గజం నొవార్టిస్​ తయారు చేసిన రుక్సోలిటినిబ్​ 5 ఎంజీ కొవిడ్ ఔషధాన్ని ఫేజ్​ 3 ట్రయల్స్​ కోసం డీసీజీఐకి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి సంస్థ నుంచి పూర్తి వివరాలు కోరినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: ట్రాన్స్​జెండర్ల సమానత్వం కోసం జాతీయ మండలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.