ETV Bharat / business

లాక్​డౌన్​ ఎఫెక్ట్​: పల్లెల్లో డేటా వినియోగం రెట్టింపు - కరోనా

లాక్​డౌన్​ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్​ వినియోగం విపరీతంగా పెరిగిందని తెలిపారు సీఎస్​సీ ఉన్నతాధికారి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 100 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించారు.

Data consumption in rural area jumped nearly 100 pc within a month: CSC CEO
గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం పెరిగిన డేటా వినియోగం: సీఎస్​సీ
author img

By

Published : Apr 7, 2020, 1:22 PM IST

కరోనా మహమ్మారి ధాటికి ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. పట్టణ ప్రజల నుంచి పల్లె వాసుల వరకు అందరూ నెట్టింట్లోనే​ కాలక్షేపం చేస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాల వినియోగం 100 శాతం పెరిగిందని తెలిపారు కామన్​ సర్వీస్ సెంటర్స్(సీఎస్​సీ) సీఈఓ దినేశ్​ త్యాగి.

నెలరోజుల్లోనే అధికం

ఇంటర్నెట్​ సేవలు అందించే సీఎస్​సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా ప్రకారం మార్చి 10 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 2.7 టీబీ డేటా వినియోగించారు. మార్చి 30 నాటికి ఈ వినియోగం 4.7 టీబీకి చేరింది. లాక్​డౌన్​ ప్రారంభం అయినప్పటి నుంచే నెట్ వినియోగం పెరిగిందని చెప్పారు త్యాగి.

" గ్రామీణ ప్రాంతాల్లో డేటా వినియోగం పెరగడమే కాకుండా, ఎఫ్​టీటీహెచ్​(ఫైబర్​ టూ హోమ్​) డిమాండ్​ అధికంగా ఉంది. కేవలం మార్చి 20లోనే ఎఫ్​టీటీహెచ్​ కోసం 50 వేల గ్రామ పంచాయతీల్లో 3 లక్షలకు పైగా చందాదారులు నమోదు చేసుకున్నారు. సీఎస్​సీ వైఫై చౌపాల్​ సేవల పేరిట సుమారు 25 వేల గ్రామ పంచాయతీలకు పైఫై హాట్​స్పాట్​లను సీఎస్​సీ అందిస్తుంది. ఈ వైఫై చౌపాల్​లో ఇప్పటికే 12 లక్షలకు పైగా రిజిస్టర్డ్​ చందాదారులు ఉన్నారు. వీరంతా తన ఫోన్ల ద్వారా కనెక్షన్ కలిగి ఉన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్​ను ఎంతగా కోరుకుంటున్నారో అర్ధమవుతోంది." ​

-- దినేశ్​ త్యాగి, సీఎస్​సీ ఎస్​పీవీ సీఈఓ

దేశంలో 60 కోట్లకు పైగా ఇంటర్నెట్​ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 29 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి బ్రాడ్​ బ్యాండ్​ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భారత్​నెట్​ ప్రాజెక్టును అమలు చేస్తోంది.

ఇదీ చదవండి: లాక్​డౌన్​లో ఏ మొబైల్​ గేమ్​ ఎక్కువగా ఆడుతున్నారు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.