ETV Bharat / business

తస్మాత్​ జాగ్రత్త.. కరెన్సీ నోట్లతో కరోనా వ్యాప్తి! - currency notes spread coronavirus

కరెన్సీ నోట్లతో కరోనా వేగంగా వ్యాపించే అవకాశాలున్నాయని స్టేట్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో పాలిమర్​ నోట్లను ప్రవేశపెట్టాలని ఎస్​బీఐ సిఫార్సు చేసింది. వీలైనంత త్వరగా కరెన్సీ నోట్లపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించింది.

currency coronavirus sbi
కరెన్సీతో కరోనా
author img

By

Published : Mar 21, 2020, 11:13 PM IST

Updated : Mar 21, 2020, 11:53 PM IST

కరెన్సీ నోట్లతో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపించే అవకాశాలున్నాయని భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్​బీఐ) పరిశోధనలో వెల్లడైంది. ఆస్ట్రేలియా, యూకే, కెనడా తరహాలో కాగితపు కరెన్సీ నోట్లకు బదులుగా పాలిమర్‌ నోట్లను తీసుకొచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పరిశోధన బృందం కోరింది. వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించాలంటే కరెన్సీ నోట్ల విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

అయితే, కరెన్సీకి బదులుగా డిజిటల్ లావాదేవీలు చేస్తే ఇంకా మంచిదని.. కానీ భారత్‌ లాంటి దేశంలో ఒక్కసారిగా నగదు లావాదేవీలను నియంత్రించడం అంత సులభం కాదని ఎస్​బీఐ పరిశోధన పేర్కొంది. కాగితపు నోట్లకు మాత్రం ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం ఉందని తెలిపింది. కరెన్సీ నోట్లపై మనుషులకు ఇన్‌ఫెక్షన్లు కలిగించే సూక్ష్మజీవులు ఉంటున్నాయని, వాటి ద్వారా పలు వ్యాధులు వస్తున్నాయని పరిశోధన బృందం పలు నివేదికలను ఉదహరించింది.

ఇదీ చదవండి: కరోనాతో జామియా వద్ద సీఏఏ వ్యతిరేక నిరసనలకు బ్రేక్​

Last Updated : Mar 21, 2020, 11:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.