స్టాక్ మార్కెట్లపై ఈ వారం కరోనా సంబంధిత అంశాల ప్రభావం ప్రధానంగా ఉండనుంది. ఆగస్టు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటం కూడా మార్కెట్లను ప్రభావితం చేసే అంశమే.
కరోనా ప్రభావం ఎంత?
భారత్‌లో కరోనా కేసులు ఇప్పటకే 30 లక్షలు దాటాయి. కేవలం 16 రోజుల్లోనే పది లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవటం ఆందోళన కలిగించే విషయమంటున్నారు విశ్లేషకులు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతిపై ప్రకటనలు వస్తే మాత్రం కాస్త సానుకూలతలు ఉండొచ్చని చెబుతున్నారు.
కరోనా కాకుండా.. ప్రపంచ వృద్ధి రేటు రికవరీ, అమెరికా-చైనా మధ్య అనిశ్చితిని తొలగించటంపై సంప్రదింపులు కూడా ఈ వారం ట్రేడింగ్‌కు ముఖ్యమని.. మోతీలాల్ ఓస్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ అధిపతి సిద్ధార్థ్ ఖీమా అంటున్నారు. ప్రస్తుత మార్కెట్ల తీరు ఆధారంగా ఈ వారం కూడా లాభాల పరంపర కొనసాగొచ్చని ఆయన అంచనా వేశారు. అయితే లాభాల స్వీకరణ కారణంగా.. కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
వీటితో పాటు ముడి చమురు, రూపాయి హెచ్చుతగ్గులు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.
ఇదీ చూడండి:'గేమింగ్ రంగానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలి'