ETV Bharat / business

కరోనాపై పోరుకు కార్పొరేట్ల తోడు.. భారీగా విరాళాలు

author img

By

Published : Mar 30, 2020, 7:06 AM IST

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు, తమ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విరాళాలు ప్రకటిస్తూ కార్పొరేట్‌ సంస్థలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నాయి. ఇతర దేశాల నుంచి కూడా భారత్‌కు సాయం అందుతోంది.

.COVID-19: PhonePe launches donation drive, aims to contribute Rs 100 cr to PM Fund
కరోనాపై పోరుకు కార్పొరేట్ల తోడు.. భారీగా విరాళాల ప్రకటన

ప్రపంచదేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోన్న కరోనా వైరస్​పై పోరాటంలో భారత్​కు అన్నివిధాలా సాయం అందుతోంది. స్వదేశీయులే కాక.. ఇతర దేశాల నుంచీ ఆపన్నహస్తం అందించడానికి ముందుకు వస్తున్నారు.

చైనాకు చెందిన జాక్‌మా ఫౌండేషన్‌, అలీబాబా ఫౌండేషన్‌లు ఫేస్‌ మాస్కులు, కొవిడ్‌-19 టెస్టు కిట్లు వంటివి సమకూరుస్తామని తెలిపాయి. భారత్‌తో పాటు మరో 6 దేశాలకు సుమారు 17 లక్షల మాస్కులు, 1,65,000 కొవిడ్‌-19 పరీక్షా కిట్లు సమకూరుస్తున్నాయి. రక్షణ దుస్తులు, వెంటిలేటర్లు, థర్మామీటర్లు కూడా సరఫరా చేయనున్నట్లు ప్రకటించాయి. తొలి విడతగా గత శనివారం ఈ సంస్థ నుంచి ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వైద్య పరికరాలను అందుకుంది.

60 కోట్లు: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఆ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ కోటక్‌ కలిపి రూ.60 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. పీఎమ్‌ కేర్స్‌ నిధికి బ్యాంకు తరఫున రూ.25 కోట్లు, వ్యక్తిగతంగా మరో రూ.25 కోట్లు అందించనున్నట్లు ఉదయ్‌ ట్వీట్‌ చేశారు. మరో రూ.10 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకు తరఫున అందించనున్నట్లు ప్రకటించారు.

కల్యాణ్‌ జువెలర్స్‌: సమాజంలోని బలహీన వర్గాలకు ఆహారంతో పాటు నిత్యావసరాలు అందించడం కోసం రూ.10 కోట్లు కేటాయించినట్లు కల్యాణ్‌ జువెలర్స్‌ ప్రకటించింది. ఇందుకోసం స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని తెలిపింది.

3 రెట్ల అధిక వేతనం: ఎమ్‌సీఎక్స్‌ కార్యాలయానికి వచ్చి పని చేసేందుకు ఎంపిక చేసిన ఉద్యోగులకు ఈ సంక్షోభ సమయంలో 3 రెట్ల వరకు అధిక వేతనం ఇవ్వనున్నట్లు అతిపెద్ద కమొడిటీస్‌ ఎక్స్ఛేంజీ ఎంసీఎక్స్‌ వెల్లడించింది. వారు కార్యాలయంలోనే ఉండేలా ఏర్పాట్లు కూడా చేసింది.

వాహనాల సర్వీసింగ్‌కు అధిక సమయం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారెంటీ ప్రయోజనాలను మరో 60 రోజులు పొడిగిస్తున్నట్లు ఇండియా యమహా మోటార్‌, టీవీఎస్‌ వెల్లడించాయి.

నీ ఫోర్టిస్‌: దేశంలోని తమ 28 ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ ప్రకటించింది. కొవిడ్‌-19 బాధితుల చికిత్స కోసం మొత్తం 262 పడకల్ని సిద్ధం చేసినట్లు తెలిపింది.

విశాఖ ఉక్కు: విశాఖపట్నం ప్లాంటులోని 3 బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల్లో ఒక దాన్ని మూసివేస్తున్నట్లు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రకటించింది. దీంతో రోజువారీ ఉత్పత్తి 12,000 టన్నులకు తగ్గుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

మరింత సమయం: టెలికాం కంపెనీలు ఏప్రిల్‌లో అందించాల్సిన నెలవారీ, త్రైమాసిక నివేదికలను సమర్పించడానికి ట్రాయ్‌ అదనంగా 6 వారాల సమయం ఇచ్చినట్లు ఉన్నతాధికారి తెలిపారు.

ఫోన్‌పే: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి విరాళాల సేకరణ ప్రారంభించినట్లు ఫోన్‌పే వెల్లడించింది. రూ.100 కోట్లను సేకరించి పీఎం కేర్స్‌ నిధికి అందజేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపింది. తమ చందాదారులు చెల్లించే ప్రతి విరాళానికి రూ.10 చొప్పున జతచేయనున్నట్లు పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.