కరోనా వైరస్ (కొవిడ్-19) విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్ తగ్గుతోందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తెలిపింది. చమురు డిమాండ్ అత్యంత కనిష్ఠ స్థాయికి చేరుకోవడం ఈ దశాబ్దాంలో ఇదే మొదటిసారని కూడా పేర్కొంది.
"కరోనా వ్యాప్తితో చైనా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. ఫలితంగా ప్రపంచ చమురు డిమాండ్ తీవ్రంగా దెబ్బతింది."- ఐఈఏ తాజా నెలవారీ నివేదిక
2020 మొదటి త్రైమాసికంలో చమురు డిమాండ్ 4,35,000 బ్యారెల్స్కు తగ్గుతుందని అంచనా. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత... మరలా ఈ దశాబ్దంలోనే ఇది మొదటి త్రైమాసిక పతనం.
ఇదీ చూడండి: కీలక రంగాల రాణింపుతో.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు