ETV Bharat / business

'భారత్​, బ్రిటన్ స్ట్రెయిన్​లపై కొవాగ్జిన్ సమర్థవంతం'

భారత్​ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా కొవాగ్జిన్​.. భారత్, బ్రిటన్ రకం స్ట్రెయిన్​లపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. జాతీయ వైరాలజీ సంస్థ, బారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఇది వెల్లడైనట్లు భారత్ బయోటెక్​ ప్రకటన విడుదల చేసింది.

COVAXIN effective against coronavirus strains found in India, UK
భారత్​, బ్రిటన్ రకం​ స్ట్రెయిన్​లపైనా కొవాగ్జిన్ సమర్థవంతం
author img

By

Published : May 16, 2021, 5:00 PM IST

Updated : May 16, 2021, 5:26 PM IST

కొవాగ్జిన్ టీకా అన్ని రకాల కరోనా స్ట్రెయిన్​లపైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు భారత్ బయోటెక్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. భారత్​లో వెలుగుచూసిన బి.1.617, బ్రిటన్​లో వెలుగుచూసిన​ రకం బి.1.1.7 స్ట్రెయిన్​లనూ ఈ వ్యాక్సిన్ అంతం చేయగలదని స్పష్టం చేసింది. జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్ఐవీ), భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఇది వెల్లడైనట్లు పేర్కొంది. ఈ మేరకు భారత్​ బయోటెక్​ కో-ఫౌండర్​ సుచిత్ర ఎల్ల ట్వీట్​ చేశారు.

COVAXIN effective against coronavirus strains found in India, UK
భారత్​, బ్రిటన్ రకం​ స్ట్రెయిన్​లపైనా కొవాగ్జిన్ సమర్థవంతం
COVAXIN effective against coronavirus strains found in India, UK
సుచిత్ర ఎల్ల ట్వీట్​

" కొత్త రకం స్ట్రెయిన్​ల నుంచి రక్షణ కల్పిస్తుందని సైంటిఫిక్ రీసెర్చ్ డేటా పబ్లిష్ కావడం వల్ల కొవాగ్జిన్​ మరోసారి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. భారత్​ బయోటెక్​ కిరీటంలో ఇది మలో కలికితురాయి."

- సుచిత్ర ఎల్ల, భారత్​ బయోటెక్ కో-ఫౌండర్, జాయింట్ డైరెక్టర్​​

ఈ ట్వీట్​లో ప్రధాని కార్యాలయంతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​లను ట్యాగ్​ చేశారు సుచిత్ర.

భారత్​లో అందుబాటులో ఉన్న మూడు వ్యాక్సిన్లలో కొవాగ్జిన్ ఒకటి. ఐసీఎంఆర్​ సహకారంతో హైదరాబాద్​కు చెందిన భారత్ బయోటెక్ దీన్ని అభివృద్ధి చేసింది.

Last Updated : May 16, 2021, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.