ETV Bharat / business

మాల్యా ఆస్తుల విక్రయానికి గ్రీన్​ సిగ్నల్! - విజయ్ మాల్యా పీఎంఎల్​ఏ కోర్టు వార్తలు

విజయ్ మాల్యాకు చెందిన ఆస్తులను విక్రయించేందుకు పీఎంఎల్​ఏ కోర్టు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. అప్పులిచ్చిన బ్యాంకులు తమ రుణాలను వసూలు చేసుకునేందుకు ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ ఆస్తులు సహా.. సెక్యూరిటీలను అమ్మేందుకు అనుమతించింది.

Vijay Mallya
మాల్యా
author img

By

Published : Jun 5, 2021, 5:20 PM IST

భారతీయ బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న విజయ్‌ మాల్యా స్థిరాస్తులు, సెక్యూరిటీలను విక్రయించుకొని డబ్బులు జమ చేసుకునేందుకు.. బ్యాంకులకు పీఎంఎల్​ఏ కోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు.. పంబాజ్ నేషనల్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జునరావు ఓ ప్రకటనలో తెలిపారు. మాల్యాకు ఎక్కువ మొత్తంలో రుణాలిచ్చిన బ్యాంకు.. ఈ ఆస్తులను వేలం వేస్తుందని తెలిపిన మల్లికార్జునరావు పీఎన్​బీ మాత్రం తక్కువ మొత్తంలోనే కింగ్‌ఫిషర్‌కు అప్పులిచ్చినట్లు వివరించారు.

ఏ బ్యాంకు వేలం వేసినప్పటికీ దామాషా లెక్కన పీఎన్​బీకి రావాల్సిన వాటా వస్తుందని చెప్పారు. ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న మాల్యాను భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

ఇవీ చదవండి: విజయ్​ మాల్యాకు కోర్టులో మళ్లీ మొండిచెయ్యి

మాల్యా ఆస్తుల వేలానికి కోర్టు గ్రీన్​సిగ్నల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.