ETV Bharat / business

3.8 కోట్ల మంది పర్యటక ఉద్యోగులకు కరోనా సెగ - దేశంలోని పర్యాటక రంగం

పర్యటక రంగంపై కరోనా వైరస్​ తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా 3 కోట్ల 80 లక్షల మందిపై ఈ ప్రభావం ఉందంటూ భారత పర్యటక, ఆతిథ్య రంగ సమాఖ్య.. ప్రధానికి లేఖ రాసింది. ఈ రంగంపై ఆధార పడిన కార్మికులకు, ఉద్యోగులకు జీతాలు అందించేందుకు తోడ్పాటునివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

Coronavirus impact may render 3.8 cr people jobless in tourism, hospitality sector
3.5 కోట్ల మంది పర్యటక ఉద్యోగులకు కరోనా సెగ
author img

By

Published : Mar 19, 2020, 6:21 PM IST

కరోనా వైరస్ ప్రభావం... దేశంలో పర్యటక, ఆతిథ్య రంగాల్లో ఉపాధి పొందుతున్న 3 కోట్ల 80లక్షల మందిపై పడే అవకాశం ఉంది. ఈ మేరకు వివరాలు తెలియజేస్తూ.... భారత పర్యటక, ఆతిథ్య రంగ సమాఖ్య ప్రధాని మోదీకి లేఖ రాసింది. దేశవ్యాప్తంగా 5కోట్ల 50 లక్షల మంది ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, కార్యకలాపాలు తగ్గిపోవటం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా కానీ అందులో 70శాతం అంటే.... 3 కోట్ల 80లక్షల మంది ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని లేఖలో తెలిపింది.

మొత్తం పర్యటక కార్యకలాపాల్లో 28 బిలియన్‌ డాలర్‌లు.... దేశీయంగా 2 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ప్రమాదంలో పడిందని వివరించింది. దీని ద్వారా 5లక్షల కోట్ల రూపాయల రాబడి ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈరంగాలపై ఆధారపడిన ఉద్యోగులు, కార్మికులకు జీతాలు, సేవలు అందించేందుకు తోడ్పాటునివ్వాలని... భారత పర్యటక, ఆతిథ్య రంగ సమాఖ్య లేఖలో పేర్కొంది.

పర్యటక రంగం నుంచి వసూలు చేసే పన్నుల నుంచి 12నెలలపాటు మినహాయింపు ఇవ్వాలని లేఖలో కోరింది. పన్ను నిబంధనలను సవరించి దివాలా తీసే పరిస్థితి నుంచి గట్టెక్కించాలని ప్రధాని మోదీకి విన్నవించింది.

ఇదీ చూడండి:స్పైస్​జెట్​ సర్వీస్​లు రద్దు- కరోనానే కారణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.