ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్​: పెరగనున్న ఎల్​ఈడీ బల్బుల ధరలు!

కరోనా దెబ్బకు త్వరలో ఎల్​ఈడీ బల్బుల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి ఎల్​ఈడీ బల్బుల విడిభాగాల సరఫరా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మార్చి నుంచి ధరలు పెంచాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయని సమాచారం.

LED bulb prices may rise
కరోనాతో ఎల్​ఈడీ బల్బుల ధరలకు రెక్కలు
author img

By

Published : Feb 19, 2020, 5:40 AM IST

Updated : Mar 1, 2020, 7:22 PM IST

చైనాలో కరోనా తీవ్రత రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం నెమ్మదిగా ఒక్కో పరిశ్రమకు విస్తరిస్తోంది. కరోనా కారణంగా మార్చి నుంచి ఎల్​ఈడీ బల్బుల ధరలు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వైరస్​ కారణంగా చైనా నుంచి ఎలక్ట్రానిక్​ విడిభాగాల సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా ధరలు పెరిగే అవకాశాలున్నాయని పరిశ్రమల విభాగం ఎలక్ట్రానిక్​ ల్యాంప్ అండ్​ కాంపోనెంట్​ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్​ (ఎల్కోమా) వెల్లడించింది.

కరోనా ప్రభావంతో డిమాండ్​కు తగ్గ సరఫరా లేదని ఎల్కోమా ఉపాధ్యక్షుడు సుమిత్​ తెలిపారు.

వాటి కొరతే అధికం..

దేశంలో తయారయ్యే ఎల్​ఈడీ బల్బులకు కావాల్సిన 60 శాతం కాంపోనెంట్​లు స్థానికంగానే లభ్యమవుతున్నాయి. మిగతా వాటిలో దాదాపు 30 శాతం వరకు చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందులో ఎలక్ట్రానిక్ డ్రైవర్స్, చిప్​లు వంటి విడిభాగాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం వీటి సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. ఈ ప్రభావంతో మార్చి నుంచి ఎల్ఈడీ బల్బుల ధరలను 8 నుంచి 10 శాతం పెంచే యోచనలో తయారీదారులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:రైల్వే అక్రమ సాఫ్ట్​వేర్లకు చెక్-ఇక అందుబాటులో తత్కాల్!

Last Updated : Mar 1, 2020, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.